అపయాలతో తమ్ముళ్లలో పరేషాన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అపయాలతో తమ్ముళ్లలో పరేషాన్


కాకినాడ, జూన్ 11, (way2newstv.com)
ఓటమి నుంచి ఇపుడిపుడే బయటపడుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు తమ పరాజయానికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారు. తాము ఎందుకు ఓడిపోవాల్సివచ్చిందో అర్ధం కావడం లేదని వాపోతున్నారు. సీనియర్ నేత అయ్యన్నపాత్రుడైతే అన్ని పనులూ చేశాం, అయినా జనం ఓడించారంటూ నేరాన్ని ప్రజల మీదకే నెట్టేశారు. మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈ ఓటమి నమ్మబుద్ది కావడం లేదుట. 36 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, అయినా పరాజయం తప్పలేదంటే వింతగా ఉందని తెగ పరేషాన్ అవుతున్నారు. ఇదే బాటలో సీనియర్ మాజీ ఎమ్మెల్యే తమ్ముళ్ళు పీలా గోవింద సత్యనారాయణ, కేఎసెన్ రాజు కూడా విషాద గీతాలు ఆలపిస్తున్నారు.ఇక మాజీ మంత్రి, పెందుర్తి నిన్నటి ఎమ్మెల్యే అయిన బండారు సత్యనారాయణమూర్తి తన ఓటమి మీద కొత్త రకమైన భాష్యం చెప్పారు. 


అపయాలతో తమ్ముళ్లలో పరేషాన్
ఓటమి కాదు ఇది, ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారు. ఓటు వేయాలనే అనుకున్నారు. పార్టీకి ఎక్కడా చెడ్డ పేరు లేదు. నా సేవలు కూడా పూర్తిగా సంతృప్తిగా అందించాను కానీ టీడీపీలోని వారే నన్ను ఓడించారంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. తన సొంత గ్రామం వెన్నెలపాలెంలో పార్టీ కార్యకర్తల మీటింగులో ఆయన మాట్లాడుతూ టీడీపీలో కోవర్టులు ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. వారే ఓటమి పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మనతోనే ఉంటూ వైసీపీకి సాయం చేశారు, కోవర్టులు ఎవరో నాకు తెలుసు, వారి బాగోతం తొందరలోనే బయటపెడతాను అంటూ బండారు గర్జించారు.సరే ఇవన్నీ ఇలా ఉంటే జనంలో పెల్లుబికిన ఆగ్రహాన్ని మాత్రం గుర్తించేందుకు టీడీపీ తమ్ముళ్ళు ఇష్టపడంలేదని వారి మాటలను బట్టి అర్ధమవుతోంది. ఈవీఎం మిషన్లలో లోపం ఉంది. వైసీపీ నేతలు కుట్ర చేశారు, సొంత పార్టీలో విభీషణులు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ తమను తాము మోసం చేసుకుంటున్నారు తప్ప ఓటమికి దారి తీసిన పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారని పార్టీలోనే సీనియర్లు అంటున్నారు. ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న నాయకులు క్యాడర్ని కానీ, ఇతర నాయకులను కానీ ఎక్కడా పట్టించుకోలేదని, మితిమీరిన విశ్వాసంతో ప్రవర్తించారని, ఇక జనంలో కూడా పనితీరు సరిగ్గా లేకనే వ్యతిరేకత వచ్చిందని, ఆ చేదు నిజం జీర్ణించుకోలేక తప్పు ఇతరుల మీద తోసేస్తున్నారని అంటున్నారు. మరి ఆత్మ విమర్శ లేకపోతే ఓటమి పాఠాలు ఎపుడు నేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.