పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ కలిపేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దీక్షను పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. గత మూడు రోజులుగా, హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద దీక్షలో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు నివేదిక ఇవ్వడంతో పోలీసులు భారీ ఎత్తున వచ్చారు. దీక్షా శిబిరం దగ్గరున్న కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టి, భట్టిని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
భట్టీ విక్రమార్క ధీక్ష భగ్నం….నిమ్స్ కు తరలింపు
ఆపై ఆయన్ను పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, తాను దీక్షను విరమించబోనని, ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఈ సందర్భంగా భట్టి వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ చర్చించాలన్నారు. ఒక గుర్తుమీద గెలిచినవారిని డబ్బుతో కొనడం సరికాదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇది ప్రజాభీష్టానికి పూర్తి వ్యతిరేకమని భట్టి విక్రమార్క ఆరోపించారు. నిమ్స్ ఆస్పత్రిలో భట్టి విక్రమార్కను కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, బోస్ రాజు పరామర్శించారు
Tags:
telangananews