స్కావెంజర్లుకేవీ జీతాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్కావెంజర్లుకేవీ జీతాలు


20  నెలలు నుంచి బకాయి పడ్డ విద్యాశాఖ
గుంటూరు, జూన్ 26, (way2newstv.com)
పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండవు. ఉన్నా వాటి నిర్వహణ లేక కంపుకొడతాయి. వాటిల్లోకి వెళ్లటం కష్టమని చాలా మంది బాలికలు పాఠశాల దశలోనే బడి మానేస్తున్నారు. ఈ రకమైన డ్రాపౌట్లు ఎక్కువుగా ఉంటున్నాయని పలు సర్వేలు ఇంతకుముందే వెల్లడించాయి. అయితే జగన్ స్కావెంజర్లకు 18 వేలు జీతం ఇవ్వాలంటూ సూచనతో నిరుద్యోగల ఆశలు పట్టకున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు వచ్చే బాలికలకు మరుగుదొడ్ల పరంగా అసౌకర్యం లేకుండా చూడాలని గడిచిన విద్యా సంవత్సరం వినుకొండ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.50, 100 చొప్పున వసూలు చేసి వాటితో మరుగుదొడ్లు శుభ్రం చేయించాలనుకున్నారు. పిల్లల నుంచి ఇలా వసూలు చేయటం తప్పని, అది విద్యాహక్కు చట్టం నిబంధనలకు విరుద్ధమని నాడు ఆమెను సస్పెండ్‌ చేశారు. ఆమె సస్పెన్షన్‌ సరికాదని, ఆమె మంచి ఉపాధ్యాయురాలని ఒకవైపు తల్లిదండ్రులు మరోవైపు స్ధానిక ప్రజాప్రతినిధి ఆమె సస్పెన్షన్‌పై పునరాలోచన చేయాలని మొరపెట్టుకున్నా అవేం పట్టించుకోకుండా సస్పెండ్‌ చేశారు. ఆ ఉదంతంతో ఏ హెచ్‌ఎం కూడా మరుగుదొడ్లకే కాదు ఏ ఇతర ఖర్చులకు కూడా పిల్లల నుంచి డబ్బులు తీసుకోకూడాదని నిర్ణయానికి వచ్చారు. 

స్కావెంజర్లుకేవీ జీతాలు

ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేయటానికి స్కావెంజర్లను పెట్టుకోవాలని, వారిని డీఆర్‌డీఏ ద్వారానే చెల్లింపులు జరపాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయం. ఉన్నత పాఠశాలకు నెలకు రూ.4వేలు చొప్పున 11 నెలలకు రూ.44వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు నెలకు రూ.2500 చొప్పున రూ.27,500, ప్రాథమిక పాఠశాలకు రూ.2 వేలు చొప్పున రూ.22వేలు మరుగుదొడ్లకు నిర్వహణ వ్యయాలు సర్వశిక్ష అభియాన్‌ నుంచి డీఆర్‌డీఏకు రావాలి. అలావస్తే వాటిని డీఆర్‌డీఏ యంత్రాంగం స్కావెంజర్లకు ఖర్చుపెడుతుంది. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు అవసరమయ్యే బ్లీచింగ్‌, పినాయిల్‌, చీపుర్లు వంటి సామగ్రి కూడా ఈ మొత్తంలో నుంచే వెచ్చించాలి. ఇన్ని నిధులు పాఠశాలకు ఏ గ్రాంటు నుంచి అందవు. స్కూల్‌ గ్రాంటు కింద రూ.10వేలు కేటాయిస్తారు. ఆ నిధులతో పాఠశాలకు నెలవారీ విద్యుత్తు, అంతర్జాలం బిల్లులు, నల్లబల్లలు, చాక్‌పీస్‌లు వంటివి కొనుగోలు చేస్తారు. వాటి కొనుగోలుకే ఆ నిధులు సరిపోవని, అలాంటప్పుడు తమ వద్ద ఏం నిధులు ఉంటాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.మరుగుదొడ్ల శుభ్రతకు ఏడాది మొత్తానికి కలిపి రూ.50 100 ఇవ్వటానికి చాలా మంది విద్యార్థులు బాధపడరు. అసలు ఒకవైపు మరుగుదొడ్ల నిర్వహణ వ్యయాలు ప్రభుత్వమివ్వక.. మరోవైపు ఆ నిర్వహణ ఛార్జీలు సొంత జేబు నుంచి వెచ్చిస్తే అవి ఎప్పటికి సమకూరతాయో తెలియక అనేక మంది హెచ్‌ఎంలు మరుగుదొడ్లు బాగున్నా బాగోకపోయినా పట్టించుకోవటం లేదు. దీంతో నిర్వహణ కొరవడి మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. ఇప్పటికే 20 నెలల బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు రూ.20వేల నుంచి రూ.44వేల దాకా రావల్సి ఉండటంతో ఇకమీదట సొంత జేబులు నుంచి వెచ్చించి మరుగుదొడ్లు శుభ్రం చేయించలేమని కొందరు హెచ్‌ఎంలు చేతులెత్తేస్తున్నారు. మున్ముందు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ మరీ అధ్వానంగా మారే అవకాశం ఉందనే ఆందోళన ఉపాధ్యాయవర్గం నుంచి వినిపిస్తోంది. గుంటూరు జిల్లాలో 3250 పాఠశాలలకు గత 11  నెలలుగా బిల్లులు పెండింగ్‌ పడ్డాయని ఉపాధ్యాయులు వివరించారు. సగటున ఒక్కో జిల్లాకు ఈబిల్లులు రూ.50 కోట్లకు తగ్గకుండా పెండింగ్‌ ఉన్నాయి. ఈ బిల్లులను సర్వశిక్ష అభియాన్‌ చెల్లించినట్లు చెబుతున్నా పాఠశాలలకు మాత్రం ఇప్పటి దాకా పైసా రాలేదని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెప్పారు.