హరీష్ రావుపై అభిమానంతో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హరీష్ రావుపై అభిమానంతో


నాడు ఉచిత కటింగ్..
- నేడు ఉపాధి మార్గం..
సిద్దిపేట, జూన్ 29 (way2newstv.com)
సిద్దిపేట పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాయి బ్రాహ్మణుడు కొత్వాల్ శ్రీనివాస్ మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. హరిశ్ రావు పై ఉన్న అభిమానము తో నర్సాపూర్ గుండ్ల చెరువు ప్రాంతంలో  "  హరీష్ అన్న హెయిర్ కటింగ్ " పేరు తో కటింగ్ షాప్ పెట్టాడు.. కొత్వాల్ శ్రీనివాస్ నాడు హరీష్ ఎన్నికల్లో అభిమానం తో లక్ష మెజారిటీ రావాలని కోరుతూ లక్ష్య సాదనలో 

హరీష్ రావుపై అభిమానంతో

ఎన్నికల్లో  3నెలల పాటు ఉచితంగా కటింగ్ చేసి వినూత్న ప్రచారం తో హరీష్ అన్న అభిమానాన్ని చాటుకున్నారు.. అదేవిధంగా నేడు హరిశ్ అన్న పేరు పై కటింగ్ షాప్ పెట్టి మరో సారి హరీష్ రావు పై ఉన్న అభిననాన్ని వ్యక్తపరిచారు.. నాడు లక్ష సాధనలో  ఉచితంగా కటింగ్ చేసి..అదే అభిమానం తో హరీష్ అన్న పేరు పై ఉపాధి ఎంచుకన్న కొత్వాల్ శ్రీనివాస్ ని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు  శనివారం నాడు కటింగ్ షాప్ ప్రారంభించిన సందర్భంగా కొత్వాల్ శ్రీనివాస్ ని అభినందించారు..15వేల రూపాయలు ఆర్థిక  సహాయాన్ని అందించి అభిమానాన్ని .. మానవత్వాన్ని చాటుకున్నారు..