ములుగుజిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
ములుగు జూన్ 10 (way2newstv.com)
ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజావాణి లోవచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేసుకున్న దరఖాస్తుల పట్ల ఎలాంటి జాప్యం చేయకుండా ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో (68) దరఖాస్తులు స్వీకరించడం జరిగింది.
Tags:
News