తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జులై 7న వెస్ట్ లండన్ లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ ని మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రోజు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. మన తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని కవిత అభినందించారు.
లండన్ బోనాల జాతర పోస్టర్ ని ఆవిష్కరించిన కవిత
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీ.ఆర్.యస్ యుకె అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్ సంస్థ ప్రతినిధులు సతీష్ రెడ్డి గొట్టెముక్కల, శ్రీమతి శ్వేతా రెడ్డి, శ్రీమతి జాహ్ణవి దూసరి , మల్లేష్ పప్పుల తదితరులు పాల్గొన్నారు.టాక్ సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న కల్వకుంట్ల కవిత గారికి టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేవలం పోస్టర్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, తెలంగాణ జాగృతి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని మీడియాకి తెలిపారు. యూకే లో నివసిస్తున్న ప్రవాసులంతా బోనాల వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలనీ కోరారు.
Tags:
telangananews