పాఠశాలల విలీనాన్ని విరమించుకోవాలి: టిపిటి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాఠశాలల విలీనాన్ని విరమించుకోవాలి: టిపిటి


హైదరాబాద్ జూన్ 17 (way2newstv.com)
రాష్ట్ర ప్రభుత్వం  విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సాకుతో పాఠశాలల విలీనాన్ని విరమించుకోవాలని  లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జీ తిరుపతిరెడ్డి హెచ్చరించారు.టి పి టి ఎఫ్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు పొన్న మల్ల రాములు అధ్యక్షతన ఉపాధ్యాయ భవన్ లో జరిగింది  ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జీ తిరుపతిరెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సాకుతో పాఠశాలల విలీనాన్ని విరమించుకోవాలని  లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఒకవైపు బడి బాట నడుస్తుండగానే ఇంకొకవైపు పాఠశాలల్ని మూసివేయాలి  అని ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు అనేక గ్రామాలలో గ్రామ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని చేర్పించే ప్రయత్నం చేయడాన్ని టి పి టి ఎఫ్ స్వాగతిస్తున్నారు .


పాఠశాలల విలీనాన్ని విరమించుకోవాలి: టిపిటి
జిల్లాలోని ఇందిరానగర్ ఉన్నత పాఠశాల మిరుదొడ్డి మండలం కొండాపూర్ ఉన్నత పాఠశాల సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో యువకులు  ప్రజా ప్రతినిధులు గ్రామంలో ఉన్న విద్యార్థులు అందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం హర్షించదగ్గ అన్నారు ఇందిరానగర్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ పొందే విద్యార్థుల్ని చేర్చుకోవడానికి విద్యాశాఖ అధికారులు అనుమతిచ్చే సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు పేద వర్గాల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో  అడ్మిషన్ కు నిరాకరించడం విద్యా హక్కుల్ని ఉల్లంఘించడమే అన్నారు వెంటనే పాఠశాలలో చేరడానికి వచ్చిన విద్యార్థులకు అవకాశం ఇవ్వాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉద్యోగులక రావాల్సిన డి ఏ ను వెంటనే ఇవ్వాలని జూలై 1  2018 నుండి పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు టిఆర్టి ఇ అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలన్నారు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుచేసి ఇ ఖాళీలుగా ఉన్న ఉప విద్యాధికారి మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు పోస్ట్ లను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు అంతర్జిల్లా బదిలీలు చేపట్టి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు ప్రతి గ్రామ పంచాయతీలో లో ఒక ప్రాథమిక పాఠశాల తప్పకుండా ఉండాలన్నారు ప్రతి ఉన్నత పాఠశాలను రెసిడెన్షియల్ పాఠశాల గా మార్చి ప్రతి విద్యార్థికి ఉదయం పలహారం సాయంత్రం ఉపాహారం ఇవ్వాలన్నారు ప్రైవేటు పాఠశాల ను నియంత్రించాలన్నారు ప్రతి ఉన్నత పాఠశాలకు తెలుగు హిందీ పి డి పోస్టులు మంజూరు చేస్తూ ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు ఈ సమావేశంలో లో జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ విజయేందర్ రెడ్డి ఇ జిల్లా నాయకులు తిరుపతి రాఘవేందర్ రెడ్డి జానకి రాములు పద్మ య్య సత్యనారాయణ శివాజీ తదితర లు పాల్గొన్నారు