ఒక్కసారి చల్లబడిన వాతావరణం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఒక్కసారి చల్లబడిన వాతావరణం


హైద్రాబాద్, జూన్ 7, (way2newstv.com)
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో మండిపోయిన మహానగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అరవై ఏళ్ల క్రితం కొట్టిన ఎండలు దంచికొట్టడటంతో రాత్రి పూట కూడా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులను చల్లటి గాలులు, చిరుజల్లులు పలకరించటంతో నగరంలో వాతావరణం చల్లబడటంతో పాటు నగరవాసులకు కాస్త ఉపశమనం కల్గింది. వాతావరణ శాఖ ప్రకటించిన విధంగా ఈ నెల 3,4 తేదీల్లోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశమున్నా, అవి ఇంకా ప్రవేశించనేలేదు. వాతావరణంలో స్వల్పంగా మార్పులొచ్చినా ఉదయం ఎనిమిది గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం రెండు, మూడు గంటల వరకు ఓ మోస్తరు ఎండ కొడుతోంది. 


ఒక్కసారి చల్లబడిన వాతావరణం
సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురుస్తున్నాయి. అంతేగాక, బలమైన ఈదురుగాలులు కూడా వీయటంతో ఇప్పటికే జిహెచ్‌ఎంసి, జలమండలి, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యగా అత్యవసర బృందాలను రంగంలో దింపారు. అయినా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురవటంతో వేడిమి కాస్త తగ్గుముఖం పట్టింది. మంగళవారం అర్థరాత్రి మూడు గంటలకు ఓ మోస్త్తరు వర్షం కురవటంతో ఉదయం చల్లటి గాలులు వీశాయి. కానీ చిన్నపాటి వర్షానికే నీరు నిలిచే లక్డీకాపూల్ చౌరస్తా మధ్యాహ్నం వరకు కూడా చిన్నసైజు చెరువును తలపింపజేసింది. వర్షం కురిసి భారీగా నీలు నిలిచే ప్రాంతాలను గుర్తించి, అప్పటికపుడు నీటిని తోడేసేందుకు పంపుపెట్లను ఏర్పాట్లు చేశామని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రకటించినా, నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే లక్డీకాపూల్ చౌరస్తాలో భారీగా నీరు నిలవటంతో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది.