ఇక కరెంట్ కు ప్రీ పెయిడ్ మీటర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక కరెంట్ కు ప్రీ పెయిడ్ మీటర్లు


మెదక్,  జూన్ 19, (way2newstv.com)
విద్యుత్ ఆదా చేసేందుకు అవసరానికి మించి కరెంట్ వాడకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది. అవసరానికి మించి వినియోగం, ఏళ్ల తరబడి బిల్లుల బకాయిలు విద్యుత్ సంస్థలకు నష్టాలు మిగుల్చుతూ మొండిబకాయిదారులకు చెక్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. విద్యుత్ ఆదాచేయడంతో పాటు కరెంటు బకాయిలకు చెక్ పెట్టేందుకు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను జిల్లాలో అమర్చుతున్నాం. మొదటి దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో 2,200 విద్యుత్ మీటర్లు అమర్చాలని లక్ష్యంగా విధించుకున్నారు. ఇప్పటి వరకు 800 ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అమర్చగా... ఇంకా మిగిలిన వాటిని ఈనెలాఖరు వరకు పూర్తి చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నది. అందరికీ నాణ్యమైన విద్యుత్ అందాలంటే విద్యుత్ దుబారాను అరికట్టాల్సిన అవసరమున్నది.


ఇక కరెంట్ కు ప్రీ పెయిడ్ మీటర్లు
ప్రభుత్వ కార్యాలయాలు, కంపెనీలలో పెద్దఎత్తున విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. విద్యుత్ బకాయిలు ఆపాలంటే ప్రీపెయిడ్ మీటర్లు ఎంతగానో ఉపయోగపడతాయిని భావిస్తున్నారు. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోతే ఎలా రీచార్జి చేసుకుంటామో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లలో కూడా అలాగే రీచార్జి చేసుకోవాలి. రీచార్జి కూపన్లు కూడా అందుబాటులో ఉంచాం. రూ.వెయ్యి నుంచి రూ.20 వేల వరకు కూపన్లను ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందిస్తున్నారు.ముందస్తుగా ఐపీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీం) కింద ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అమర్చుతున్నారు. అవసరమైన విద్యుత్‌కు బిల్లు చెల్లించి వాడుకోవాల్సి ఉండడంతో దుబారాకు అడ్డుకట్టపడి విద్యుత్ సరఫరా మెరుగుపడనున్నది. జిల్లాలో మొదటి దఫాలో 2,200 ప్రభుత్వ కార్యాలయాల్లో పాత మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని లక్ష్యం విధించుకున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 800 ప్రభుత్వ కార్యాలయాలకు మీటర్లు బిగించారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే ప్రీపెయిడ్ మీటర్లు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పాటు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇష్టానుసారంగా కరెంట్‌ను దుబారా చేయకుండా అరికట్టేందుకు ఐపీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీం) కింద ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అమర్చుతున్నారు. ఈ మీటర్లు సెల్‌ఫోన్ రీచార్జి విధానంలా పనిచేస్తాయి. ముందుగా ఆయా కార్యాలయాలకు ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో కొత్త ప్రీపెయిడ్ మీటర్లు అమర్చుతారు. ఆయా కార్యాలయాలకు నెలసరి బిల్లులు వస్తున్న ప్రకారం రూ.వెయ్యి నుంచి రూ.20వేల వరకు రీచార్జి కార్డులు విద్యుత్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందజేస్తారు. కార్డులను ఆయా ప్రభుత్వ కార్యాలయాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏ కార్యాలయంలో ఎంత కార్డు రీచార్జి చేయించారో అది పూర్తవగానే ఆటోమెటిక్‌గా కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. తిరిగి కార్డును రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. రీచార్జి చేసుకోగానే ఆటోమెటిక్‌గా కరెంట్ సరఫరా తిరిగి పనురుద్ధరణ జరుగుతుంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దుబారా తగ్గి కరెంట్ పొదుపు అవుతుందని, మొండి బకాయిలు తగ్గుతాయని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు.  ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బకాయి ఏరియర్స్ రోజురోజుకు పెరిగిపోతుండడంతో విద్యుత్ రంగ సంస్థలకు నష్టాలు వాటిల్లుతున్నాయి. జిల్లాలో విద్యుత్ బకాయిలు వేలాది రూపాయలు పేరుకుపోయాయి. వాటిని వసూలు చేయడం సిబ్బందికి తల నొప్పిగా మారుతుంది. వీటిని అరికట్టేందుకే మొదటగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చుతున్నారు. దీనివల్ల కరెంట్ దుబారా కాకుండా అరికట్టడం, కావల్సినంత విద్యుత్‌ను వాడుకునే అవకాశం ఉంటుంది.ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్ ఆదా అవుతుండడంతో ప్రభుత్వానికి ఆదాయం మిగులుతుంది. ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ దుబారాను అరికట్టి కావలసిన మేరకే విద్యుత్ వాడుకోవచ్చు. ప్రతి కార్యాలయంలో ఎన్ని యూనిట్లు వాడుతున్నామో దాని ఆధారంగా రీచార్జి చేసుకుని అవసరం మేరకు వాడుకోవచ్చు. ఎంత అవసరం అవుతుందో అంతే రీచార్జి చేసుకోవచ్చు. ఒక వేళ కరెంట్ ఎక్కువగా వాడదామనుకున్నా బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. తిరిగి రీచార్జి చేసుకుంటే ఆటోమెటిక్‌గా కరెంటు సరఫరా జరుగుతుందిః