ఇవాళ్టి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్‌బోర్డు అధికారి తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు
జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సఫ్లిమెంటరీ సజావుగా జరిగేలా 10 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు, 10 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఒక కస్టోడియన్ ఆఫీసర్, ఒక ఫ్లయింగ్‌స్కాడ్, ఒక సిట్టింగ్ స్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని డీఐఈవో శ్రీనివాస్ తెలిపారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఆర్టీసీ జిల్లాలోని పలు రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్యశాఖ ప్రథమ చికిత్స కోసం పారా మెడికల్ సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచుతుందన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి విద్యార్ధులను అనుమతించమని స్పష్టం చేశారు.
Tags:
telangananews