జగన్ పై తమ్ముళ్లు నమ్మకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ పై తమ్ముళ్లు నమ్మకం


నెల్లూరు, జూన్ 26, (way2newstv.com)
చంద్రబాబుకు ఇపుడు ఏ వైపు చూసిన్నా జగనే కనిపిస్తున్నాడు. వై ఎస్ జగన్ మాత్రమే కాపాడగలరని తమ్ముళ్ళు కూడా అనుకుంటున్నారు. జగన్ దయ తలిస్తేనే టీడీపీ బతికి ఉంటుందని, లేకపోతే నిట్ట నిలువునా చీలిపోతుందని కూడా భయపడుతున్నారు. ఇదే నా అభయం, మీ ఎమ్మెల్యేలు నాకొద్దు. నాకున్న వారు చాలు. నేను కనుక గేట్లు తెరిస్తే మీ వారంతా జంప్. కానీ నేను అలా చేయను. చేస్తే నాకు బాబుకు తేడా ఏముంటుంది. ఇదీ నిండు అసెంబ్లీలో జగన్ ఇచ్చిన అభయం. దాంతో బాబు గారు అండ్ కో తెగ ఆనందపడ్డారు. ఆయితే ఆ ఆనందం ఎక్కువ సేపు ఉండేలా కనిపించడంలేదు.


జగన్ పై తమ్ముళ్లు నమ్మకం
బీజేపీ ఈ అవకాశాన్ని తీసుకుని గేట్లు తెరచేసింది. ముందుగా రాజ్య‌సభ సభ్యులు నలుగురిని తమ వైపుకు తిప్పుకుంది. వారికి బీజేపీ ఎంపీలుగా ముద్ర వేసేసింది ఇక ఇపుడు చూపు ఏపీ మీద పడింది. ఇక్కడ అసెంబ్లీలో ఉన్న వారిలో మూడింట రెండు వంతుల మందిని లాగేయాలని కమలం స్కెచ్ వేస్తోంది. అదే జరిగితే బాబు గారి అప్పోజిషన్ పోస్ట్ కూడా వూడిపోతుంది. మరి బాబు గారు మాత్రం ఏమి చేయగలరు. వై ఎస్ జగన్ దయ మీదనే తమ్ముళ్ళు ఆశలు పెట్టుకున్నారు.అయితే తాను ఎమ్మెల్యేలను తీసుకోనని అన్నారు కానీ వేరేవరో తీసుకుంటే కాపలా కాయగలనా అని జగన్ లాజిక్ తీస్తే మాత్రం టీడీపీ డేంజర్ లో పడినట్లే. అసెంబ్లీలో ప్రత్యేక గ్రూప్ గా బీజేపీ వస్తే మాత్రం చంద్రబాబు కు ఆ ఉన్న పదవీ పాయే మరి. అయితే బయటకు ఎంతలా జగన్ని తిడుతున్నా తమ్ముళ్లకు మాత్రం వై ఎస్ జగన్ నిబద్దత మీద, విశ్వసనీయత మీద ఎంతో నమ్మకం ఉంది. ఆడి తప్పడని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడని జగన్ విషయంలో ఇపుడు చాలా నమ్మకంగా నిబ్బరంగా ఉన్నారు. మరి ఆ నమ్మకమే ఇపుడు టీడీపీకి బతికి బట్టనీయాలి.