గేర్ మార్చిన కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గేర్ మార్చిన కేసీఆర్


హైద్రాబాద్, జూన్ 7, (way2newstv.com)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూటు మార్చారు. కొద్ది రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంలో కేత్రస్థాయి పర్యటనలు, కీలక నిర్ణయాలు తీసుకోని కేసీఆర్... ఎన్నికలు పూర్తయిన వెంటనే పరిపాలనపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై కూడా దృష్టి పెట్టారు. పెన్షన్ల పెంపు, రైతుబంధు నిధుల విడుదల చేపట్టిన ప్రభుత్వం... కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టు పనులను పరిశీలించి జూలైలో ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలని అధికారులకు సూచించారు. 


గేర్ మార్చిన కేసీఆర్
ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో తగిలిన షాక్ కారణంగానే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత మార్పు వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవడం... బీజేపీ అనూహ్యంగా బలపడి ఉత్తర తెలంగాణలోని మూడు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్ అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది. పరిపాలనపై ఫోకస్ చేయడంతో పాటు త్వరలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టి కేటీఆర్, హరీశ్ రావును మళ్లీ కేబినెట్‌లోకి తీసుకుని కీలక శాఖలను కట్టబెట్టే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇంతకాలం ఎక్కువగా సమీక్షలకే పరిమితమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... తాజాగా క్షేత్రస్థాయి పర్యటనలు, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్నికల ఫలితాలు కూడా ఓ కారణమే అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.