విధి విధానాలు లేని నేత చంద్రబాబు


విశాఖపట్నం (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు  ముఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టుకొని పార్టీని నడపాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జగన్ దయ దాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. 


విధి విధానాలు లేని నేత చంద్రబాబు
శనివారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు లాగ జగన్ పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా మిగలడు. చంద్రబాబు విధి విధానాలు లేని  నాయకుడు. రోజుకి ఒక మాట పూటకు ఒక విధానం. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించే వారిని అనర్హులను చేసి సభ్యత్వాన్ని రద్దు చేస్తానని జగన్ ప్రకటించడం దేశానికే ఆదర్శమని అయన అయన్నారు.
Previous Post Next Post