వైద్యులపై దాడులు ఆపాలి


షాద్ నగర్ ప్రభుత్వ వైద్యులు 
షాద్ నగర్ కమ్యూనిటీ వైద్యశాలలో నిరసన, ధర్నా 
షాద్ నగర్, జూన్ 17 (way2newstv.com)
రోగి తరపున బంధువులు వైద్యశాలలో నానా హంగమా చేస్తూ, సేవా దృక్పధంతో ఉన్న వైద్య బృందంపై దాడులు చేయడం హేయమైన చర్యని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి ప్రభుత్వ వైద్యులు అన్నారు.కలకత్తాలో ప్రభుత్వ వైద్యునిపై అక్కడి రోగి బంధువులు దాడి చేయడంతో ప్రస్తుతం అతను చావుబతుకుల మధ్య ఉన్నాడని, దానికి నిరసనగా ఆయన ప్రభుత్వ వైద్యశాల ప్రభుత్వ వైద్యబృందంతో కలిసి నిరసన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 


వైద్యులపై దాడులు ఆపాలి
ఈ సందర్భంగా వారు మాట్లడుతూ కలకత్తాలోని ప్రభుత్వ వైద్యశాలకు 75 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధుడికి గుండెపోటు రావడంతో అతని బంధువులు తీసుకుని వచ్చారని, అయితే అప్పటికే వృద్దుడు మృతి చెందడంతో ఆ విషయం గురించి చెప్పిన అదే వైద్యశాల వైద్యుడు ముఖర్జీపై మృతుని బంధు వులు విచ్చక్షణా రహితంగా దాడి చేయడంతో నేడు అతను చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడని తెలిపారు. ప్రభుత్వ వైద్యులపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల నిర్వహణ అధికారి డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ పద్మజా, డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ చందన, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సురేందర్, డాక్టర్ షికాసింగ్, డాక్టర్ సుజాత, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post