దేశానికే తలమానికంగా తెలంగాణ గురుకుల పాఠశాలలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దేశానికే తలమానికంగా తెలంగాణ గురుకుల పాఠశాలలు


ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూలు జూన్ 17 (way2newstv.com)
తెలంగాణ ప్రభుత్వం విద్యపై అధిక ప్రాధాన్యత ఇచ్చి కేజీ టు పీజీ నిర్బంధ విద్యను అందించే గురుకులాలను స్థాపించిందని,  రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాల  దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు సోమవారం తాడూరు మండల కేంద్రానికి నూతనంగా మంజూరైన బిసి బాలికల గురుకుల పాఠశాలలను సొంత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా ఉయ్యాలవాడ లోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధిక సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేసిందని స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కేవలం 48 గురుకుల మాత్రమే ఉండేదని అన్నారు. 


దేశానికే తలమానికంగా  తెలంగాణ గురుకుల పాఠశాలలు 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకులాల సంఖ్య గణనీయంగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి  ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం  నేడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో  119 బీసీ   గురుకులాలను ఈరోజు ప్రారంభించు కుంటున్నామని తెలిపారు.  గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి కంటే మెరుగ్గా వసతులను కల్పిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గుర్తు చేశారు. ఇన్ని వసతులతో కల్పించిన గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు దీన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఐపీఎస్, ఐఏఎస్ ఇంజనీర్లు మంచి ఆశయాలతో లక్షణాలను ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రుల ఆశలను సీఎం కేసీఆర్ ఆశయాలను గురుకులలో చదువుతున్న విద్యార్థులు నెరవేర్చాలని ఎమ్మెల్యే కోరారు. గురుకులాలలో చదివేందుకు ఎంతోమంది ఉన్నతమైన కుటుంబాల పిల్లలు సైతం పోటీ పడుతున్న రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా  సీట్లను భర్తీ చేస్తోందని దీనికోసం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.  నియోజకవర్గంలో  విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ వాల్ మరుగుదొడ్లు అదనపు తరగతి గదులను ఏర్పాటు చేసేందుకు  తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని హామీ ఇచ్చారు.