స్థానిక అంబెడ్కర్ భవన్ లో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల పైన సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ భేటీ హజరయ్యారు. ఆరు జిల్లాల కలెక్టర్ లు, జడ్పీ చైర్మన్ గద్దల పద్మ, కూడా చైర్మన్ , శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పోలీస్ అధికారులు, అన్నీ శాఖల అధికారులు పాల్గోన్నారు. మంత్రి మా్ట్లాడుతూ ఎన్నో పోరాటాలు ,త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో ప్రతీ జిల్లా ప్రతి అంశం లో అభివృద్ధి కావాలి. క్షేత్ర స్థాయి వరకు సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని అన్నారు. హరితహారం లో అనుకున్న సక్సెస్ రాలేదు. ప్రజలు కోరుకునే చెట్లు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
ప్రతి అంశంలో అభివృద్ది కనపడాలి
ప్రతి డిపార్ట్ మెంట్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని అయన సూచించారు. దేశం లోనే హరితహారం కి గొప్ప పేరు రావాలి. పట్టాదారు పాస్ బుక్ లు 80 శాతం ఇచ్చారు. చాలా చోట్ల ఇబ్బంది కరమైన పరిస్థితులు ఉన్నాయి. పోడు భూముల సమస్యలను తీర్చాలి. అధికారులు చాకచక్యంగా వ్యవహరించాలి. ఆరు జిల్లా లోని అన్నీ గ్రామాలు ఓడీఎఫ్ గ్రామాలు అయ్యేందుకు కృషి చేయాలని అన్నారు. రైతులకు ప్రభుత్వం అన్నీ రకాలుగా సహకరిస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహా లను ఇవ్వాలి. ఆసరా పెన్షన్ లను జులై 1 st నుండి పంపిణీ చేయనున్నాం. ఇంకా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మెరుగు పడాలి. బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాల లో చదివేల చైతన్యం రావాలని మంత్రి అన్నారు. రెండు పడక గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయలి. దేవాదుల కి భూమి సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. దేశం లో ఎక్కడలేని విధంగా, ఎవరూ చేయలేని విధం గా అతి తక్కువ వ్యవధిలో కాళేశ్వరం ని మన ముఖ్యమంత్రి పూర్తి చేశారు. దీని ద్వారా మొదలు లాభపడేది మన వరంగల్ జిల్లా. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి పక్క ప్రణాలికను తయారు చేసుకుందాం... ప్రతి మూడు నెల లకి రివ్యూ చేసుకుందామని మంత్రి సూచించారు.