ఈనెల 12న విశాల్ `అయోగ్య‌` తెలుగులో గ్రాండ్ రిలీజ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈనెల 12న విశాల్ `అయోగ్య‌` తెలుగులో గ్రాండ్ రిలీజ్

(way2newstv.com)

విశాల్‌ హీరోగా  తమిళంలో రూపొందిన `అయోగ్య` చిత్రం తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఏ.ఆర్.మురుగ‌దాస్ శిష్యుడు వెంకట్‌ మోహన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విశాల్ స‌ర‌స‌న రాశీఖన్నా కథానాయికగా నటించారు. `ఠాగూర్‌` మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని  సార్థక్ మూవీస్ అధినేత ప్ర‌శాంత్ గౌడ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 12న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజీగా రిలీజ్ చేయ‌నున్నారు. 

ఈనెల 12న విశాల్ `అయోగ్య‌` తెలుగులో గ్రాండ్ రిలీజ్


నిర్మాత ప్ర‌శాంత్ గౌడ్ మాట్లాడుతూ -`` `అయోగ్య` త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించింది. అక్క‌డా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో అద‌ర‌గొట్టింది. త‌మిళ క్రిటిక్స్ ఈ చిత్రానికి 3.5 రేటింగులు ఇచ్చి ప్ర‌శంస‌లు కురిపించారు. విశాల్ ఎన‌ర్జీ లెవ‌ల్ ని ప‌దింత‌లు చూపించిన సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్ సినిమాకే హైలైట్. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా ప‌తాక స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దారు. త‌మిళంలో హిట్ట‌యిన ఈ చిత్రాన్ని తెలుగులో  మా సార్థక్ మూవీస్  ద్వారా రిలీజ్ చేస్తుండ‌డం ఆనందాన్నిస్తోంది. తెలుగులో విశాల్ న‌టించిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా విజ‌యాలు అందుకుంటున్నాయి.  ఆ కోవ‌లోనే అయోగ్య ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈనెల 12న ఏపీ- నైజాంలో రిలీజ్ చేస్తున్నాం`` అని తెలిపారు.