గురుకులాల్లో 1698 పోస్టుల భర్తీ.. వివరాలు ఇలా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గురుకులాల్లో 1698 పోస్టుల భర్తీ.. వివరాలు ఇలా

హైదరాబాద్, జూలై 13 (way2newstv.com)
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నియామకాలకు సంబంధించి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు  ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన వాటిలో ప్రిన్సిపల్, టీజీటీ, పీఈటీ పోస్టులతో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి. తెలంగాణ  రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐ-ఆర్బీ) ద్వారా ఈ మొత్తం పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానికత, ఆయా ప్రాంతాల్లో పోస్టుల ఖాళీలు, రోస్టర్పాయింట్ల ఆధారంగా ఎంపికలు చేపట్టాలని ఆదేశించారు. 
గురుకులాల్లో 1698 పోస్టుల భర్తీ.. వివరాలు ఇలా

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..
పోస్టులు పోస్టుల సంఖ్య
ప్రిన్సిపల్స్                                 36
టీజీటీ (ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) 1,071
పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)   119
లైబ్రేరియన్                                119
ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్   119
స్టాఫ్ నర్స్                                119
జూనియర్ అసిస్టెంట్ కమ్                  110
జూనియర్ అసిస్టెంట్                  05
ఇతర పోస్టులు                472
మొత్తం పోస్టులు              1,698