గ్రామానికి 2 వేల ఇళ్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రామానికి 2 వేల ఇళ్లు

చింతమడకకు కేసీఆర్ వరాలు 
మెదక్, జూలై 22(way2newstv.com)
సొంతూరైన చింతమడకకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. భవిష్యత్‌లో చింతమడక బంగారు తునక కావాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు లబ్ధి పొందే పథకానికి శ్రీకారం చుడుతామని కేసీఆర్‌ తెలిపారు. చింతమడకకు 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నానని ఆత్మీయ అనురాగ సభా వేదికపై సీఎం ప్రకటించారు. కార్తీక మాసంలో చింతమడకలో గృహప్రవేశాలు జరగాలి. చింతమడక నన్ను కనిపెంచింది. చింతమడక కోసం నేతు ఎంత చేసినా తక్కువే అని ఆయన అన్నారు. చింతమడక కోసం అదనంగా రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నానని చెప్పారు. అదనపు నిధులు ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్‌ పొందవచ్చు అని సూచించారు. ప్రతి ఇంటిపై సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసుకోవాలి. అద్భుతమైన ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలి. సీసీరోడ్లు వేయించుకోవాలి. తాగు, సాగురు త్వరలో రాబోతోంది. చింతమడక ఒక బంగారు తునక కావాలి. ఈ గ్రామాన్ని చూసి పక్క ఊర్లు నేర్చుకోవాలి. అలాంటప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతది. చింతమడకలోని 2 వేల కుటుంబాలు బాగుపడాలి అని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. 

గ్రామానికి 2 వేల ఇళ్లు

రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించిన రోజు చాలా సంతోషపడ్డాను. మన రాష్ట్రంలో ఆలోచించినట్లు.. దేశంలో రైతుల గురించి ఆలోచించడం లేదు. ఈ పథకాలు పేద కుటుంబాలకు అండగా ఉన్నాయి. చింతమడక చాలా మంచి ఊరు. వాస్తు కూడా అద్భుతంగా ఉంది. ఊరికి నాలుగు మూలల్లో నాలుగు అద్భుతమైన తటాకాలు ఉన్నాయి. మళ్లీ గ్రామంలో నీటి ఊటలు, బావుల్లో జాలు చూడబోతున్నాం. మీ ఊరి బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చనుబాలు ఇచ్చి పెంచిన నా ఊరు చింతమడక. మరో మూడు గ్రామాలు నాకు విద్యాబుద్ధులు ప్రసాదించాయి. తొలి ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించాం. విద్యుత్‌, తాగునీటి సమస్యలు లేకుండా చేశాం. ఈసారి స్వగ్రామ అభివృద్ధికి సంకల్పించాం. ఊరు బాగుపడాలంటే ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలి. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేశాను. మీకు మంచిగా పని చేసే కలెక్టర్‌ ఉన్నాడు. ఊరికి అర్జెంట్‌గా రెండు రోడ్లు కావాలి.. మూడు నెలల్లో వేయిస్తాం. ఒక్క చింతమడకలనే బాగుచేస్తే దంతె కలవదు కాబట్టి.. నియోజకవర్గమంతా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారుచేస్తాం. చింతమడక నుంచే ఆరోగ్య సూచిక తయారీకి నాంది పలకాలి. చింతమడక ఊరంతా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందిస్తాం. వెంటనే ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయాలని హరీష్‌ రావును కోరుతున్నా. నెల రోజుల్లో చింతమడకలో సమస్యలు లేకుండా చేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేలను కోరుతున్నాను. చింతమడక ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయాలి. యావత్‌ తెలంగాణ ఆరోగ్య సూచిక తయారు చేయాలనే ఆలోచన ఉంది. చింతమడకలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తా. వలస వెళ్లిన వారిని కూడా పిలిచి పథకాలు అందేలా చూడాలి. గ్రామంలోని ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు లబ్ధి చేకూరుస్తాం. ప్రభుత్వం అందించే లబ్ధి ద్వారా యువత ఉపాధి పొందాలి. ఎవరు ఏ ఉపాధి మార్గం ఎంచుకున్నా అభ్యంతరం ఉండదు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు లబ్ధి పొందే పథకానికి శ్రీకారం చుడుతాం. వరి నాటేసే మిషన్లు కొనుకుంటే లాభసాటిగా ఉంటుంది. ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటే లబ్ధి తప్పక పొందుతారు. పైసలు మిగిలితే ఆవులో, బర్రెలో కొనుక్కోవాలి. ఊరిలోని 2 వేల కుటుంబాలు బాగుపడాలి. చింతమడకలో నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.
చింత లేని గ్రామంగా చింతమడక
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ చింతమడక పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్‌ రావు ప్రసంగించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు చింతమడక బాసటగా నిలిచింది. ఆమరణ దీక్ష సమయంలో చింతమడకలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. ఉద్యమంలో మీరంతా కేసీఆర్‌ను వెన్నంటి ఉన్నారు. చింతమడకవాసులతో ఆత్మీయానురాగాలు పంచుకునేందుకు కేసీఆర్‌ వచ్చారు. కేసీఆర్‌ రాకతో బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు ఒక్కసారి వచ్చినట్లుంది. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తాం. ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం చేయిస్తాం. చింతమడక పరిసర గ్రామాలకు రహదారులు కావాలని విజ్ఞప్తులు అందాయి. చింతమడకలో అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నాం. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నిధుల మంజూరు చేయాలని విజ్ఞప్తి. సిద్దిపేట పట్టణంలో మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నానని హరీష్‌ రావు పేర్కొన్నారు.