రెండు అరటి పండ్లు 442 ..

ఛండీఘడ్, జూలై 24, (way2newstv.com)
అరడజను అరటి పండ్లు ఎంత ధర ఉంటుంది? సుమారు రూ.30 ఉంటుంది. లేదా వాటి రకాన్ని బట్టి రూ.40 నుంచి రూ.60 కూడా ఉండవచ్చు. కానీ, అక్కడ మాత్రం రెండు అరటి పండ్లు రూ.442.50 మాత్రమే. వామ్మో, అంత ధర? అవి అంత ప్రత్యేకమైన పండ్లా? అంత ధర ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా? అవి కూడా సాధారణ పండ్లే. 
రెండు అరటి పండ్లు 442 ..

అయితే, అవి ఫైస్‌ స్టార్ హోటల్‌కు వెళ్లడం వల్ల విలువ ఒక్కసారిగా పెరిగిపోయిందంతే! బాలీవుడ్ హీరో రాహుల్ బోస్ చండీగడ్‌లో ఓ షూటింగ్ నిమిత్తం ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేశాడు. జిమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత రెండు అరటి పండ్లను ఆర్డర్ చేశాడు. వాటికి రూ.442.50 బిల్లు వేయడంతో రాహుల్ షాకయ్యాడు. సెంట్రల్ జీఎస్టీ రూ.33.75, యూటీ జీఎస్టీ రూ.33.75 జీఎస్టీతో కలిపి అంత బిల్లు వేశారు. దీంతో రాహుల్.. పండ్లు ఆరోగ్యానికి హానికరం కాదని ఎవరు చెప్పారంటూ సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని షేర్ చేశాడు.
Previous Post Next Post