అంగన్ వాడీల్లో చిన్నారులకు అందని పౌష్టికాహారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అంగన్ వాడీల్లో చిన్నారులకు అందని పౌష్టికాహారం


గుంటూరు, జూలై 3, (way2newstv.com
ఐసీడీఎస్‌లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మహిళలు వాపోతున్నారు.   ప్రభుత్వం 2017 జూలై 1వ తేదీన అన్ని జిల్లాలో అమ్మ అమృత హస్తం పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా జిల్లాలో 5 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం 2,14,562 మందికి అందిస్తున్నారు. వీరికి రోజుకు రూ.6 వెచ్చించింది. అనంతరం 2017 డిసెంబర్‌ నుంచి రూ. 8లకు పెంచింది. గర్భిణులకు 27,482 మంది బాలింతలకు 24,971 మందికి పౌష్టికాహారం అందజేస్తున్నారు. వీరికి రూ.17 ఒక్క రోజుకు ఖర్చు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 4405 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. రూరల్‌ జిల్లాలో 834, అర్బన్‌లో 3571 సెంటర్లు నడుస్తున్నాయి. వాటితోపాటు మినీ సెంటర్లు 54 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 23 మంది సీడీపీవోలు, 16 మంది ఏసీడీపీవోలు పని చేస్తున్నారు.అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తలు గర్భిణులు, బాలింతలకు పోషక ఆహారం, ఆరోగ్య పరీక్షలు, సలహాలు సంప్రదింపులు, వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య విద్య, పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తారు. 

అంగన్ వాడీల్లో చిన్నారులకు అందని పౌష్టికాహారం

చిన్నారులకు సంరక్షణ, ఆటపాటలు, మద్యాహ్న భోజనం వంటి విధులు నిర్వర్తిస్తారు. కేంద్రాలలోని ఆయాలు వీరికి సహాయకులుగా ఉంటారుగర్భిణులకు ప్రతి సోమవారం అన్నం, కూరగాయల సాంబారు, గుడ్డు కూర, పాలు, మంగళవారం..అన్నం, పప్పు, ఆకు కూర, గుడ్డు, పాలు, బుధవారం.. అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు, పాలు, గురువారం కూరగాయాలతో సాంబరు, గుడ్డు కూర, పాలు, శుక్రవారం.. అన్నం, పప్పు, ఆకు కూర, గుడ్డు, పాలు, శక్రవారం.. ఆకు కూరతో పప్పు, గుడ్డు, పాలు ప్రభుత్వం నిర్ణయించిన తూకం ప్రకారం అందించాలి. ఇదే తరహాలో ప్రీ స్కూల్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. కానీ ఎక్కువ కేంద్రాల్లో ఈ మెనూ అమలు కావడం లేదు. కేంద్రాలపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం సక్రమంగా బిల్లులు అందించకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని అంగన్‌వాడీ నిర్వాహకులు వాపోతున్నారు.గ్రామీణ ప్రాంతాలలో గర్భిణులు పౌష్టికాహారం అందించేందుకుగాను వసతుల కల్పనకు గ్రామ పంచాయతీల నిధులలో రూ.5 వేలు ఖర్చు చేయాలని ప్రభుత్వం జారీ చేసింది. అయితే చాలా కేంద్రాల్లో వసతులు కల్పన మృగ్యంగా మారింది. దీంతో గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. అనేక చోట్ల కుర్చీలు లేక నేలపైనే ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో వారు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహారం తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా అంగన్‌వాడీ సిబ్బందిని తరలిస్తున్నారు. సంబంధించి ప్రయాణ ఖర్చులుగానీ, భోజన వసతిగానీ కల్పించడం లేదు.