హైదరాబాద్,జూలై 2, (way2newstv.com)
తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొన్ని రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం కొన్ని రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హరితహారం కార్యక్రమం లో భాగంగా జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి మొక్కలు పెంచు కున్న నర్సరీ పర్యవేక్షించారు.
నర్సరీలను పరీక్షించిన జిహెచ్ఎంసి కమిషనర్ దానం కిషోర్
దాదాపుగా ఆరు లక్షల యాబై వేల మొక్కలు పంచుతున్నట్లు ప్రతి ఇంట్లో 10నుంచి 15 మొక్కలు ఉండాలని జీవకోటికి మనిషి మనుగడకు ఆక్సిజన్ ఇచ్చే ప్రాణదాతలు చెట్లను ప్రతి ఒక్కరు వాటిని పెంచాలని జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో చార్మినార్ జోనల్ కమిషనర్ కృష్ణ,అడిషనల్ కమిషనర్ ఆమ్రపాలి ఐ ఏ స్ ఆఫీసర్,రాజేంద్రనగర్ సిర్కిల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్,ఆంజనేయులు.తదితరులు పాల్గొన్నారు,