మెట్రోతో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు అనుసంధానం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మెట్రోతో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు అనుసంధానం

హైద్రాబాద్ జూలై 26. (way2newstv.com)
 మెట్రోరైల్ స్టేషన్లతో నగరంలోని ప్రముఖ బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లను అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతమైంది. మూడు కారిడార్లకు సమీపంలోని బస్‌స్టేషన్లను స్కైవాక్స్ ద్వారా అనుసంధానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఎంజీబీఎస్‌లో నిర్మిస్తున్న మెట్రో ఇంటర్‌ఛేంజ్ నుంచి ఎంజీబీఎస్‌తోపాటు, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతాల్లోమొదటి ప్రాధాన్యతగా అందుబాటులోకి తేనున్నారు. అనంతరం మెహిదీపట్నం, కోఠి, పంజగుట్ట, జేబీఎస్‌తోపాటు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. 
మెట్రోతో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు అనుసంధానం

ప్రజా రవాణాను ప్రోత్సహించే క్రమంలో 42 మల్టీలెవెల్ కారు పార్కింగ్ స్టేషన్లను నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. హైదరాబాద్ మెట్రోరైలు ఆధ్వర్యంలో పార్కింగ్ స్లాట్లు ఏర్పాటు చేయనున్నారు. మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాలు నిర్మించే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిసింది. వీటి నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో టెండర్లు పిలువనున్నట్లు మెట్రోరైలు సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. మల్టీలెవెల్ పార్కింగ్ కోసం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మెట్రోరైలుతోపాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాలతోపాటు ప్రైవేట్ భాగస్వామ్య పద్ధ్దతిలో వీటిని నిర్మించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోరైలుకు సంబంధించి 72 కిలోమీటర్ల మార్గంలో స్టేషన్లకు సమీపంలో పార్కింగ్ స్టేషన్లను నిర్మిస్తున్నారు. పార్కింగ్ చేసి ఇంటికి లేదా కార్యాలయాలకు వెళ్లే సమయాల్లో షాపింగ్ చేసుకోవచ్చు.