హజ్ హౌస్ ను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హజ్ హౌస్ ను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ‌

సిద్ధిపేట, జూలై 24 (way2newstv.com)
జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన హజ్ హౌస్ ను బుధవారం  రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు.  కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు, వెంట ఎమ్మెల్సీలు ఫారూఖ్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్- ఎమ్మెల్సీ మహ్మద్ సలీం, మౌలానా ముఫ్తీ కలీల్ అహ్మద్- షేక్ హుల్ జామియా,మౌలానా కుబూల్ పాషా సత్తారి, రాష్ట్ర హజ్ హౌస్ ఛైర్మన్ మసీహుల్లా ఖాన్, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, వైస్ ఛైర్మన్ అక్తర్ పటేల్, తన్జీమ్ అధ్యక్షుడు గౌస్ మొహియుద్దీన్‌, సిద్ధిపేట హజ్ హౌస్ సోసైటీ అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్, ఇతర ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనారిటీ మత పెద్దలు పాల్గొన్నారు. 
హజ్ హౌస్ ను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ‌

కాగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని తన నివాసంలో బుధవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీకి మాజీ మంత్రి హరీష్ రావు పుష్ఫగుచ్ఛం అందించి స్వాగతించారు.  అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో హోం మంత్రి మహమూద్ అలీ గౌరవ వందనం స్వీకరించారు. అదే విధంగా సిద్ధిపేటలో నూతనంగా ప్రారంభించిన హజ్ హౌస్ లో హజ్ కు వెళ్లే 52 మంది యాత్రికులను  రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, సలీంలు సన్మానించారు. కార్యక్రమంలో నవాబ్ మొహినుద్దిన్ తో పాటు మత పెద్దలు  పాల్గొన్నారు.