హైద్రాబాద్ జూలై 17 (way2newstv.com)
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో రుతుపవనాలు బలపడనున్నాయి. దీని ఫలితంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మందగించడంతో వానలు కురవలేదు. దీంతో రైతులే కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రుతుపవనాలు పుంజుకున్నాయని, 2019, జులై 18వ తేదీ బుధవారం, జులై 19వ తేదీ గురువారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరో రెండు రోజులు వానలే..వానలు
నైరుతి, పశ్చిమ దిశల నుంచి నైరుతి పవనాలు బలంగా వీస్తున్నాయని, గాలిలో తేమ కూడా పెరగడంతో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయన్నారు. గత వారం రోజులుగా మేఘాలు దట్టంగా అలుముకోవడంతో భారీ వర్షాలు కురుస్తాయని భావించారు. అయితే తేలికపాటి వర్షాలే కురిశాయి. రుతుపవనాలు ఉత్తర భారతం వైపు బలంగా కదిలాయి. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. మరో వైపు 2019, జులై 16వ తేదీన పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, రంగారెడ్డి జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిశాయి.
Tags:
telangananews