రెవిన్యూలో ఏసీబీ దాడుల భయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెవిన్యూలో ఏసీబీ దాడుల భయం

హైద్రాబాద్, జూలై 18, (way2newstv.com)
టర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులకు ఏసీబీ గుబులు పుడుతుంది. ఏసమయంలో తన ఆస్తులపై దాడిచేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.ఇటీవలే రంగారెడ్డి జిల్లా కొందర్గు తహసీల్దారు లావణ్య ఏసిబీ అధికారులకు దొరికి రూ.93లక్షల నగదు సోదాల్లో బయటపడటంతో నిఘా అధికారులు గ్రేటర్ పరిధిలోని రెవెన్యూ అధికారుల బాగోతాలపై నిఘా పెట్టినట్లు చర్చించుకుంటున్నారు. గత రెండేళ్ల కాలంలో వివిధ హోదాల్లో పనిచేసే 46 మంది ఉద్యోగులు అవినీతి నిరోధకశాఖ అధికారులు చేతికి చిక్కారు. ఇప్పటివరకు దొరికిన వారిలో రూ.2వేల నుంచి రూ. 25వేలవరకు తీసుకున్నవారే దొరకగా, లావణ తహసీల్దార్ వద్ద భారీ మొత్తంలో దొరకడంతో రియల్ వ్యా పా రం బాగా సాగే మండలాల్లో అధికారులు ఏస్ద్థాయి లో అవినీతి ఏస్దాయిలో ఉంటుం దో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు ఆశాఖకు చెందిన అ ధికారులు చెబుతున్నారురెండేళ్ల కితం మియాపూర్ భూకుంభకోణం తరువాత 5మంది అధికారులు వే టు వేసి, మిగతా అధికారుల్లో తీరు మారలేదని విమర్శలు వస్తున్నాయి.
 రెవిన్యూలో ఏసీబీ దాడుల భయం

నిఘా అధికారులు తిరుమలగి రి, బాలానగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్, ఉప్ప ల్, బోడుప్పల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మీర్‌పేట, అబ్దులాపూర్‌మెట్ మండలాల్లో పనిచేసే ఉద్యోగులు భూరికార్డుల విషయంలో అవినీతికి పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించినట్లు తెలవడంతో ఆయా మండలాల్లో విధులు నిర్వహించే అధికారులు తమ ఆస్తులను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నట్లు కింది స్దాయి ఉద్యోగులు గుసగుసలాడుతున్నారురెవెన్యూశాఖలో పట్టుబడినవారిలో వీఆర్వోలు 15మంది, సర్వేయర్లు 11, రికార్డు అసిస్టెంట్లు 09, ఆర్‌ఐలు 06, తహసీల్దార్లు 5 ఉన్నట్లు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రెవెన్యూశాఖను రద్దుచేస్తామని పేర్కొన ప్రకటనలో భాగంగా ఆశాఖ అధికారులపై అవినీతి కత్తి పెట్టారని తహసీల్దా రు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్టీఏ, పోలీ సు,వాణిజ్యపన్నుశాఖ,హెచ్‌ఎండిఏ,మున్సిఫల్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్న ఎందుకు పట్టించుకోవడంలేదని, కేవలం రెవెన్యూశాఖ ఉద్యోగులపై దా డులు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.కొంతమంది అ ధికారు లు చేసే అడ్డగోలు వ్యవహారాలకు మి గతా అధికారులను అదే విధంగా చూడటం సరికాదంటున్నారు.