అర్జున్ మూవీలో టబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అర్జున్ మూవీలో టబు

హైద్రాబాద్, జూలై 26, (way2newstv.com)
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫామిలీ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కి రిలీజ్ అవుతున్న ఈసినిమా లో ఓ ముఖ్య పాత్ర లో సీనియర్ నటి టబు నటిస్తుంది. రీసెంట్ గా ఆమె షూటింగ్ లో పాల్గొనున్నారు.ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ అత్తారింటికి దారేది చిత్ర విజయం తరువాత నుండి తన చిత్రాలలో ఓ పవర్ ఫుల్ లేడీ రోల్ చుట్టూ కథ రాసుకుంటున్నారు. 
అర్జున్ మూవీలో టబు

ఈమూవీ తరువాత అ ఆ చిత్రం లో నదియా తో మహాలక్ష్మి అనే పాత్ర చేయించాడు. అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్బూ పవన్ కు తల్లి గా చేసింది.అయితే బన్నీ సినిమాలో టబు అత్త పాత్రే చేస్తుంది. త్రివిక్రమ్ ఈసినిమాను సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిస్తున్నాడు. బన్నీ కి సిస్టర్ పాత్రలో నివేదా థామస్ కనిపించనుంది.అత్తారింటికి దారేది, అ ఆ చిత్రాలలో అత్త ఎంత హైలైట్ అయిందో అదేవిధంగా ఈచిత్రంలో కూడా టబు అంతే హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈమూవీలో హీరో సుశాంత్, నవదీప్ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.