ప్రతి మొక్క బతకాలి : మంత్రి ఎర్రబెల్లి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రతి మొక్క బతకాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ జూలై 22  (way2newstv.com):  
నాటిన ప్రతి మొక్క బతకాలని, దీని కోసం సమష్టిగా కృషి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్లూఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. నర్సరీ, ప్లాంటేషన్ నిర్వహణపై దూలపల్లిలోని ఫారెస్టు అకాడమీలో జిల్లాల అధికారులకు రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారం నుంచి మొదలైంది. డీపీవో, ఈవోపీఆర్, ఎంపీడీవో, ఎఫ్ఆర్వో, ఏవో, హార్టికల్చర్ ఆఫీసర్, ఏపీవో, ప్లాంటేషన్ మేనేజర్లు, వన అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్యఅతిధిగా మాట్లాడారు.
 ప్రతి మొక్క బతకాలి : మంత్రి ఎర్రబెల్లి
'హరితహారం గొప్ప కార్యక్రమం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమం లేదు. ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేని అంశం ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా హరితహారాన్ని ప్రారంభించారు. పర్యావరణం విషయంలో ఇంత శ్రద్ధ చూపే ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరూ లేరు. హరితహారంతో భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు జరుగుతుంది. నాటిన ప్రతి మొక్కను బతికించాలి. అవి చెట్లుగా పెరిగినప్పుడే కార్యక్రమం పూర్తయినట్లు. హరితహారం అంటే హడావుడిగా, మొక్కుబడిగా మొక్కలు పెట్టి వదిలేయడంకాదు. సంరక్షణ బాధ్యత ముఖ్యం. నాటిని మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకునేలా ప్రజలను భాగస్వాములను చేయాలి. గ్రామాల్లో మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యదర్శులు తీసుకోవాలి. మొక్కల సంరక్షణ, పర్యవేక్షణ కోసం మండల స్థాయిలోని అధికారులకు ఒక్కో గ్రామం బాధ్యతలను అప్పగించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ముందుగా హెచ్చరిక నోటీసులు ఇవ్వాలి. అయినా పరిస్థితి మారకుంటే చర్యలు తీసుకోవాలి. ఎన్నికలలో గెలవడం గొప్పకాదు. బాధ్యతను  చక్కగా నిర్వహించకపోవడమే పెద్ద పరాజయం. గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చగా ఉండేలా స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి. హరితహారంపై ఆసక్తి ఉన్న వారినే గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులుగా నియమించేలా చర్యలు తీసుకుంటాం. హరితహారం, పరిశుభ్రత కోసం ఔత్సాహికులతో కమిటీలో వేయాలి. ఆయా గ్రామాల్లోని ఎన్ఆర్ఐలను, వ్యాపారవేత్తలను, ఎన్జీవోలను హరితహారంలో భాగస్వాములను చేయాలి. సీఎం కేసీఆర్ కోరుకున్న విధంగా మన రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ కావాలి. మొక్కల సంరక్షణపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి. మొక్కల సంరక్షణ కోసం సర్కారు తుమ్మను వినియోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. బెంగళూరు నగరంలో ఇలాగే చేశారు. అన్ని గ్రామాల్లో దీన్ని అమలు చేస్తే ఖర్చు లేకుండా మొక్కలను సంరక్షించుకోవచ్చు. నాటిన ప్రతి మొక్క పెరగడం లక్ష్యంగా సమష్టిగా పని చేయాలి’ అని అన్నారు. పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి పి.కె.ఝా, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూప్రసాద్ పాల్గొన్నారు. మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి...పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్లూఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ ఆవరణలో మొక్కలు నాటారు.కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కు బాగుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహానగరం హైదరాబాద్కు సమీపంలో 90 ఎకరాల్లో ఆక్సిజన్ పార్కును అహ్లదకరంగా అభివృద్ధి చేశారని చెప్పారు.  అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి(ïపీసీపీఎఫ్) పి.కె.ఝా ఆహ్వానం మేరకు మంత్రి దయాకర్రావు సోమవారం ఆక్సిజన్ పార్కును సందర్శించారు. ఆక్సిజన్ పార్కు మొత్తం కలియదిరిగారు. పార్కులోని పక్షుల విభాగాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆహ్లాదం కోసం పార్కుకు వచ్చిన పాఠశాలల విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆక్సిజన్ పార్కు అభివృద్ధిని, ప్రణాళికను ïపీసీపీఎఫ్ పి.కె.ఝా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు వివరించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ పాల్గొన్నారు.