సత్ఫాలిస్తున్న నైట్ షెల్టర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సత్ఫాలిస్తున్న నైట్ షెల్టర్లు

హైద్రాబాద్, జూలై 23 (way2newstv.com)
హైద్రాబాద్ మహానగరంలో నిరాశ్రయుల కో సం మరికొన్ని నైట్‌ షెల్టర్లు అందుబాటులో రా ను న్నాయి. రూ.9.71 కోట్ల అంచనా వ్యయంతో ఏడు నైట్‌ షెల్టర్ల చేపట్టగా అందులో ఇప్పటికే మూడు పూర్తయ్యాయి. మరో నాలుగు నిర్మాణంలో ఉ న్నాయి.గ్రేటర్‌లో అధికారిక లెక్కల ప్రకారం 1,516 మంది నిరాశ్రయులు ఉన్నట్టు తేలింది. వీరిలో 1,128 మంది పురుషులు, 328 మంది మహిళలు. ప్రస్తుతం నగరంలో ఉన్న 12 నైట్‌ షెల్టర్లలో 530 మంది తల దాచుకుంటున్నారు. వీటిలో 8 షెల్టర్లు పురుషులకు, నాలుగు ప్రత్యేకంగా మహిళలకు కేటాయించారు.ఇవిగాక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీకి చెందిన నాలుగు కమ్యూనిటీ హాళ్ల ను నైట్‌ షెల్టర్లుగా మార్చనున్నారు. 
సత్ఫాలిస్తున్న నైట్ షెల్టర్లు

ఉప్పల్‌లోని దేవేంద్రనగర్‌ కమ్యునిటీహాల్, ముషిరాబాద్‌ సర్కిల్‌ రోజ్‌ కాలనీ కమ్యూనిటీహాల్, చందానగర్‌ లోని హఫీజ్‌పేట్‌ కమ్యూనిటీహాల్, బేగంపేట పో స్టాఫీస్‌ కమ్యూనిటీ హాల్‌ ఇందులో ఉన్నాయి. నగరంలో పది రోజులుగా కురుస్తున్న ముసురు నేపథ్యంలో నైట్‌ షెల్టర్లు నిరాశ్రయులకు వరంగా మా రాయి. అధికశాతం పేదలు, ఏవిధమైన ఆధారంలేకుండా జీవనోపాధి కోసం వచ్చేవారే. వీరందరికీ ఈ షెల్డర్లు నీడినిస్తున్నాయి.వీటి నిర్వహణ బాధ్యతలను సేవారంగంలో పేరొందిన స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఇందులో ఆశ్రయం కల్పించేవారి ఆధార్, ఓటర్‌ గుర్తింపులతో పాటు బ్యాంకు ఖాతాలను కూడా తెరుస్తారు. ఈ నైట్‌ షెల్టర్లలో ఉండేవారికి ప్రైవేట్‌ రంగంలో తగు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా జీహెచ్‌ఎంసీ చేపట్టింది.   ఉప్పల్‌ సర్కిల్‌లోని పాత మున్సిపల్‌ ఆఫీస్‌,ఎల్బీనగర్‌ సర్కిల్‌లోని సరూర్‌నగర్‌ పాతఞచావడి భవనం,అంబర్‌పేట సర్కిల్‌ గోల్నాక క్రాంతి నగర్‌  కమ్యూనిటీహాల్‌, సికింద్రాబాద్‌ సర్కిల్‌ నామాలగుండులో నైట్‌షెల్టర్‌ లను మహిళలకు కేటాయించారు. ఇక  పురుషుల కోసంచార్మినార్‌ సర్కిల్‌లోని పేట్లబుర్జు వార్డు ఆఫీస్‌ ,గోషామహల్‌ సర్కిల్‌ శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌కాలనీ,యూసుఫ్‌గూడలోని వార్డు కార్యాలయం మొదటి అంతస్తు,ఖైరతాబాద్‌ సర్కిల్‌లోని బేగంపేట ఫ్లై ఓవర్‌ కింద,గచ్చిబౌలి సర్కిల్‌ శేరిలింగంపల్లి పాత మున్సిపల్‌ కార్యాలయం, మల్కాజ్‌గిరి సర్కిల్‌లోని ఆర్‌.కె.పురం  బ్రిడ్జి సమీపంలో.. సికింద్రాబాద్‌ బేగంపేట ఫ్లైఓవర్‌ బ్రాహ్మణవాడి , మెహిదీపట్నం సర్కిల్‌ మాసాబ్‌ట్యాంక్‌ మహవీర్‌ ఆస్పత్రి, నీలోఫర్‌ ఆస్పత్రి , గోషామహల్‌లోని కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి .రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీ లలో ఏర్పాటు చేస్తున్నారు.