హైద్రాబాద్, జూలై 22, (way2newstv.com)
నిరంతర విద్యుత్ సరఫరాతో పరిశ్రమలు పవర్‌ఫుల్‌గా మారుతున్నాయి. రాష్ట్రంలో ఒకప్పుడు 6000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాలంటే అధికారులు భయాందోళనకు గురైన సంఘటనలు ఉన్నాయి. కానీ నేడు 12000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి అధికారులు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో సుమారుగా 1700 మెగావాట్లుంటే నేడు 3300 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో విద్యుత్తు సరఫరా అయ్యే ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే మరమ్మతులు చేసి తీసుకువచ్చేందుకు రెండు రోజుల సమయం పట్టేదని రిటైర్డ్ విద్యుత్ శాఖాధికారులే వివరిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయినా, విద్యుత్ తీగలు, స్తంభాలు విరిగిపోయినా, ఫీడర్లు చెడిపోయినా వెంటనే విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
పరిశ్రమలకు పవర్ ఫుల్
గ్రేటర్‌లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు, లైన్ల మార్పిడి, భూగర్భ విద్యుత్ లైన్లు, కవర్డ్ కండక్టర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది.నిత్యావసరాల వస్తువుల తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతి వస్తువు ఉత్పత్తికి విద్యుత్ తప్పనిసరి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చేందుకు నిరంతరం శ్రమించింది. దీంతోనే తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది ప్రజల కండ్లల్లో కాంతులు కనిపిస్తున్నాయి. మహానగరంలోని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలకు విద్యుత్ కోతలు లేకుండా ఉండేందుకు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం రూ.300 కోట్ల వ్యయంతో ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతాల్లో ఆటోమెటిక్ రీస్టోరేషన్ ఆఫ్ పవర్‌సప్లయ్ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి, టెండర్లకు ఆహ్వానం పలికారు. ఇప్పటి వరకూ గ్రేటర్‌లో చిన్న, మధ్య తరగతి, భారీ పరిశ్రమలు ఉన్న ఐడీఏ బొల్లారం, నాచారం, కూకట్‌పల్లి, చర్లపల్లి ప్రాంతాల్లోనే ఎల్‌టీ, హెచ్‌టీ కనెక్షన్లున్నాయి. అయితే ఈ ప్రాంతంలోని పరిశ్రమ యాజమాన్యాలు గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. గత ప్రభుత్వాలు విద్యుత్ రంగంపై తీసుకున్న విధానాలతో పరిశ్రమలు మూతపడ్డాయి. వారంలో 4 రోజులు పవర్ హాలిడేలు ఇస్తే ఉత్పత్తి తగ్గడం, ధరలు పెరుగడం, ఉద్యోగులను తీసివేయడంతో పాటు యాజమాన్యాలు ఇబ్బందులు పడ్డ సంఘటనలు అనేకం. ఇబ్బందులు తీర్చడానికి సీఎం కేసీఆర్ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు అంతరాయం జరిగితే సమాచారం ఇస్తే విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా ఆటోమెటిక్ రీస్టోరేషన్ ఆఫ్ పవర్ సప్లయ్ పద్ధతిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది.కరెంట్ కోతలు లేకుండా పోయాయి, రియల్ రంగం ఊపందుకున్నది. వెల్డింగ్ పనులకు తీరికలేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు రుణ పడి ఉంటారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సఫలీకృతమైంది. గతంలో చేతి నిండ పని ఉన్నా....చేయడానికి కరెంట్ ఉండేదికాదు. దీంతో వచ్చిన ఆర్డర్లు సకాలంలో అందజేయలేక పోయా. ప్రస్తుతం పుష్కలంగా కరెంట్ ఉండడంతో చేతినిండా పని దొరుకుతున్నది.
Tags:
telangananews