కరుణించిన వరుణుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కరుణించిన వరుణుడు

ఊపందుకున్న – వరినాట్లు
పనిలో నిమగ్నమైన ఆన్నదాతలు
ముసురుతో - రైతన్నల ఆనందోత్సవం
జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు
జిల్లాలో సాగుకు - 30వేల హెక్టార్ల అంచనా
జగిత్యాల జూలై  30, (way2newstv.com)
ఆరుగాలం కష్టపడి పండించే రైతున్నలకు ఎట్టకేలకు వరుణుడు  కరుణించడంతో జిల్లాలో వరినాట్లు ఊపందుకున్నాయి. గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టి దుబురుగా ,వర్షం పడటంతో వ్యవసాయ పనుల్లో ఆన్నదాతలు నిమగ్నమయ్యారు. రైతన్నలు పోలలో ట్రాక్టర్ ద్వారా దున్ని ,చదును చేసుకుని వరినాట్లు వేయడానికి ఇతర గ్రామాల నుండి కూలీలను పిలిపించుకుని నాట్లు వేస్తున్నారు. ఇప్పుడున్న సమయంలో ఎకరానికి 3500 నుండి 4000 రూపాయలు వరకు గుత్తకు కూలీలు మాట్లాడుకుని రోజుకు 2,3,ఎకరాలు నాట్లు వేస్తుంటారు. 
కరుణించిన వరుణుడు

అలాగే కూలీలు మొదటగా ఒక గ్రూపుగా 15 మందితో ఏర్పడతారు.ఆతరువాత గంప గుత్థకు మాట్లాడుకుని నాట్లు వేస్తారు. ఈముసురుతో రైతున్నల్లో ఆనందోత్సవం వెల్లివీరుస్తోంది.జిల్లాలోని 18 మండలాల్లో జగిత్యాల ,జగిత్యాల రూరల్ , మల్యాల, కోడిమ్యాల ,సారంగపూర్ ,ధర్మపురి, గొల్లపెల్లి,పెగడపెల్లి, బీర్ పూర్ ,బుగ్గారాం ,వెల్గటూర్,మేడిపల్లి, ,కోరుట్ల, రాయికల్ ,కథలాపూర్,మెట్ పెల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మండలాల్లో ఖరీఫ్ సాగు ఈసారీ 30వేల హెక్టార్లలో వరినాట్లు వేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లా లో ఇప్పటికి వ్యవసాయ బావుల ద్వారా అక్కడక్కడ కొన్ని చోట్ల 6,000 హెక్టార్లలో నాటువేశారు.దీనితో జిల్లాల్లో 15శాతం వరకే నట్లు వేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. అయితే వర్షాలు ఆలోశంగా  కురువడంతో ఆనుకులంత గత సంవత్సరం 40వేల హెక్టార్లలో రైతు వరి నట్లు వేశారు. ఈసారి వర్షాలు సారైన సాయయానికి కురువడక పోవడం ఆన్నదాతలు నిరాశ గుర్యారు.గత సంవత్సరం వేసినంత ఈసారి వరి నట్లు వేయలేకపోతున్నారని తెలిపారు.