డిజిటల్ పాస్ పుస్తకాల్లో తప్పుల తడకలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డిజిటల్ పాస్ పుస్తకాల్లో తప్పుల తడకలు


వరంగల్, జూలై 5, (way2newstv.com)
రాష్ట్ర ప్రభుత్వం భూ వివరాల సేకరణ నమోదుకు ప్రతిష్టాత్మకంగా భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ వివరాల నమోదులో చాలా వరకు తప్పులు దొర్లాయి. ఈ తప్పులను ప్రస్తుతం సవరిస్తున్నారు. భూ సమస్యలసవరణ మరింత వేగంగా పూర్తి కావడం కోసం ధరణి వెబ్‌సైట్‌ను తీసుకొచ్చారు. ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసిన డిజిటల్ పాస్‌పుస్తకాల్లో అనేక తప్పులు దొ ర్లాయి. ప్రభుత్వం రైతులకు అందజేసిన రైతుబంధు పథకం చెక్కులతో పాటు పాస్‌పుస్తకాలు కొంత మంది రైతులకు రాలేదు. ఇలాంటి వారికి ధరణి వెబ్‌సైట్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక తప్పులను సరిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్ ద్వారా ఆధార్, వేలి ముద్రలు తదితర వివరాలను పొందుపరుస్తున్నారు. అనంతరం కొత్త పాస్ పుస్తకాల ముద్రణకు అధికారులు సిద్ధం కావాల్సి ఉంటుంది. రెండో విడత పాస్‌పుస్తకాల పంపిణి కావాల్సి ఉన్నా ధరణి వెబ్‌సైట్ సర్వర్ సమస్యలతో సేవలను పూర్తిస్థాయిలో విస్తరించలేక పోతున్న ట్లు అధికారులు తెలుపుతున్నారు.

డిజిటల్ పాస్ పుస్తకాల్లో తప్పుల తడకలు

ధరణి సేవల సర్వర్ వేగవంతం కాగానే ముద్రణ ప్రారంభించి రైతులకు పుస్తకాల పంపిణీ జరుగుతుందన్నారు.ధరణి వెబ్‌సైట్ ద్వారా ఐదు రకాల సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మా భూమి స్థానంలోనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ధరణి వెబ్ సైట్‌ను ఏకకాలంలో చేపట్టేందుకు తీర్చిదిద్దుతున్నారు.నూతన పాస్‌పుస్తకాల్లోనితప్పులను సరిచేయడం,పట్టామార్పిడి,భూమివిలువ ధ్రువపత్రాలమా ర్పు, దస్తావేజు నమోదు, వ్యవసాయ,ఆదాయ ధ్రువీకరణ పత్రం లాంటి వాటిని ధరణి ద్వా రా చే సేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్‌లను,మ్యూటేషన్ వాటి ని ఏకకాలంలో నిర్వహించేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు అధికారుల సమాచారం.భూ రికార్డుల ప్రక్షాళనలో  తప్పులు సరిచేశామని రెవె న్యూ అధికారులు పదే పదే చెబుతున్నప్పటికీ నూతన డిజిటల్ పాస్‌పుస్తకాల్లో చాలా వరకు తప్పులు దొర్లడం తో కొంత మంది రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. కొంత మంది రైతులు పాస్‌పుస్తకాల్లో పేర్లు, విస్తీర్ణం వంటి తప్పులు ఉన్న ట్లు రైతుబంధు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ సమయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాటిని రెవెన్యూ అధికారులు  తిరిగి తీసుకున్నారు. రెండో దశ పాస్‌పుస్తకాలు అందజేస్తామని అధికారులు చెప్పినా నేటికీ పాస్‌పుస్తకాలు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ధరణీ వెబ్‌సైట్ సర్వర్ సమ స్య వల్ల అధికారులు సతమ త మవుతున్నారు.