పెట్టుబడులకోసమే విదేశీ పర్యటనలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పెట్టుబడులకోసమే విదేశీ పర్యటనలు

శాసనసభలో చంద్రబాబు నాయుడు
అమరావతి  జూలై 15, (way2newstv.com)
ప్రతి దానికి తనపై విచారణ జరిపించాలని ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విమర్శించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేపట్టినట్టు తెలిపారు. ప్రధాని మోదీ కూడా చాలా దేశాల్లో పర్యటించారన్నారు. ప్రధాని మోదీ కూడా చాలా దేశాల్లో పర్యటించారన్నారు. 
పెట్టుబడులకోసమే విదేశీ పర్యటనలు

ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీని నెంబర్ వన్ స్థానానికి చేర్చామని తెలిపారు.రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డామని చంద్రబాబు అన్నారు.  మీరు కూడా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయండి కానీ.. వృథా ఖర్చు అంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. నాపై విమర్శలు చేయడం కాదు.. మీ వెనక ఉన్నవి చూసుకోండని చంద్రబాబు అన్నారు.  పోలవరం ప్రాజెక్టుపై కొత్త అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. భూసేకరణ చట్టం వచ్చాక పరిహారం బాగా పెరిగిందన్నారు. ప్రాజెక్టు పనులు 71.3 శాతం పూర్తయ్యాయన్నారు. వైఎస్ఆర్ హయాం నుంచి పోలవరం ప్రాజెక్టుపై చర్చకు సిద్దమని అయన అన్నారు.