పార్టీల్లో మామ, అలుళ్ల సవాల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పార్టీల్లో మామ, అలుళ్ల సవాల్


నెల్లూరు, జూలై 4, (way2newstv.com)
నారా, నందమూరి వియ్యమంది నాలుగు దశాబ్దాలైంది. ప్రముఖ సినిమా నటుడు నందమూరి తారక రామారావు వెండి తెర మీద వెలిగిపోతున్న రోజుల్లో అప్పటి కాంగ్రెస్ మంత్రి చంద్రబాబుని ఏరి కోరి అల్లుడిని చేసుకున్నారు. ఆ తరువాత రోజులలో బాలక్రిష్ణ కూడా చంద్రబాబు కొడుకు లోకేష్ ని తన ఇంటి అల్లుడిగా చేసుకుని ఆ వియ్యాన్ని మరింతగా ఖాయపరచుకున్నారు. ఇలా నారా, నందమూరి బంధం కలగలసిపోయింది. టీడీపీలో పాతికేళ్ళ క్రితమే నందమూరి ఆధిపత్యం చెరిగిపోయి నారా పెత్తనం వచ్చేసింది. ఎన్టీయార్ కంటే చంద్రబాబు నాయకత్వంలోనే టీడీపీ ఎక్కువ కాలం మనగలిగింది. ఆ విధంగా చూసినా పార్టీ ఎవరిది అంటే సమాధానం చాలా సులువు. అయితే ఇపుడు మూడవతరంలో మళ్ళీ నారా నందమూరి వంశాల మధ్య ఆధిపత్య పోరు తెర మీదకు వస్తోంది.తాజా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక నాయకత్వ సంక్షోభం ఆ పార్టీలో తలెత్తుతోందని ప్రచారం సాగుతోంది. 

పార్టీల్లో మామ, అలుళ్ల సవాల్

బాబుది ముదిమి వయసు. లోకేష్ ది విఫల రాజకీయం, దాంతో జూనియర్ ఎన్టీయార్ కి పగ్గాలు అప్పగించాలని డిమాండ్ ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. ఏకంగా సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ దీని మీద ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశారు. పార్టీలో కూడా ఆ అభిప్రాయం చాలా మందిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇంతలా పెంచిన పార్టీని తిరిగి మళ్ళీ నందమూరి వంశానికి ఇచ్చేటంత ఉదార స్వభావి చంద్రబాబు కారని అందరికీ తెలిసిందే. ఇక జూనియర్ విషయం తీసుకుంటే ఇప్పటికిపుడు ఆయన సినిమాలు వదిలి రాజకీయాల్లోకి రారు కానీ, టీడీపీ నాయకత్వం మాత్రం నందమూరి వంశీయుల చేతుల్లో ఉండాలన్నది ఆయన కోరిక, షరతు కూడానట. అందుకోసం తాను టీడీపీకి ఏ రకంగా సాయపడాలన్నా ముందు లోకేష్ బాబుని తప్పించి టీడీపీలో కీలక బాధ్యతలు తన సోదరి బ్రాహ్మణికి ఇమ్మని జూనియర్ చెబుతున్నారట.టీడీపీలో సర్వ అధికారాలూ తాను బతికి ఉన్నంతవరకూ తన వద్దనే ఉంచుకోవాలనుకుంటున్న చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోరు అంటున్నారు. ముఖ్యంగా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిండెంట్ పదవి ఇవ్వాలన్నది బాబు ఆలోచగా ఉందని అంటున్నారు. తన తరువాత టీడీపీ పగ్గాలు కుమారుడికే అన్నది బాబు పక్కా ఆలోచనగా ఉంది. కనీసం కోడలిని కూడా పార్టీలోకి తీసుకోవాలన్న ధ్యాస, ఊసు కూడా చంద్రబాబుకు లేనేలేవని అంటున్నారు. ఈ రకమైన ఆలోచనలతో బాబు ఉంటే జూనియర్ ఇపుడు వేసిన కొత్త ఎత్తు చివరికి తన కోడలి నుంచి నేరుగా జూనియర్ కే పగ్గాలు వెళ్ళేట్టు చేస్తుందని ఎరగని వారు కాదు బాబు. అందుకే ఆయన నో అంటున్నారని టాక్. ఏది ఏమైనా జూనియర్ కన్ను ఎక్కడ పడాలో అక్కడ పడిందని, బాబు ఎంత వీక్ అయితే జూనియర్ అంత బలంగా టీడీపీ వైపుగా దూసుకువస్తాడని అంటున్నారు. చూడాలి ఈ మామా అల్లుళ్ల సమరం ఎంతవరకూ వెళ్తుందో