తెలుగు రాష్ట్రాల సీఎస్ లభేటీ
హైద్రాబాద్, జూలై 2, (way2newstv.com)
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ స్వేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. విభజన సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని యోచిస్తున్నారు. విభజన సమస్యలకు సానుకూల పరిష్కారం కనుగొనాలని జగన్, కేసీఆర్ నిర్ణయించారు. జులై 3, 2019 నాటికి గవర్నర్ దగ్గర జరిగే సమావేశానికల్లా వీటన్నింటికీ పరిష్కార మార్గాలు సూచించాలని తమ అధికారులను ఆదేశించారఉద్యోగుల విభజన పంచాయితీని తేల్చాలని.. వారు ఎక్కడ పని చేయడానికి ఇష్టపడతారో అక్కడే ఉంచండని.. రూల్స్ అంటూ గిరిగీయకండని అని ఇద్దరు సీఎంలు స్పష్టం చేశారు. వాస్తానికి 9వ షెడ్యూలులోని 91 సంస్థల్లో 40 సంస్థలపై ఎలాంటి ు.వివాదాలు లేవు. వీటికి షీలా భిడే కమిటీ కూడా ఆమోదం తెలిపింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపి..
గవర్నర్ సమక్షంలో
జీవోలు జారీ చేయడమే మిగిలివుంది. అయినా ఈ విషయం కొలిక్కి రాలేదు. మిగతా సంస్థల సమస్యలూ పరిష్కారం కాలేదు.సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎస్‌ఆర్ విభాగాధిపతులకు సూచించారు. నిధులు, వేతనాల సమస్య ఉందనుకుంటే.. తమకు వదిలేయాలన్నారు. అంతగా కావాలనుకుంటే.. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుందన్నారు. సమస్యగా ఉంటే.. సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి ఉద్యోగ విభజన చేపట్టండని కేసీఆర్ సూచించారు. సామరస్యంగా, న్యాయబద్ధంగా పంపకాలు జరగాలన్నారు. ఆయా అంశాలపై కేసీఆర్ చేసిన సూచనలతో ఏపీ సీఎం జగన్ కూడా ఏకీభవించినట్లు తెలిసింది.ఆంధ్రా ప్రాంతానికి చెందిన విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పని చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంల సూచనల మేరకు శనివారం, ఆదివారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సలహాదారులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో చర్చలు జరిపారు. ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల విభజన వంటి అంశాలపై చర్చినున్నారు. గోదావరి నీటిని తరలించే విషయంలో తగిన ప్రాతిపదికలు రూపొందించే బాధ్యతను రెండు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా స్వీకరించనున్నారు. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీల ఆధ్వర్యంలో జరుగనుంది. జూలై 15, 2019లోపు అధికారులు ఇద్దరు సీఎంలకు నివేదిక ఇవ్వనున్నారు.ఃః
Tags:
telangananews