రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు

హైదరాబాద్, జూలై 29   (way2newstv.com)
వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ రాగల రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 
రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు

దీని ఫలితంగా రాబోయే మూడు రోజులూ తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నుంచి పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సైతం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Previous Post Next Post