హరీష్ రావు అనే నేను విరివిగా చెట్లు పెంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హరీష్ రావు అనే నేను విరివిగా చెట్లు పెంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను

నేనుకూడా హరితసైనికుడిలా కొనసాగుతాను
 సిద్దిపేట, జూలై 12 (way2newstv.com)
తన్నీరు హారీష్ రావు అనే నేను....రోజురోజుకు వాతావరణంలో ఉష్షోగ్రతలు పెరిగి పోతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవటం లేదు. మానవ మనుగడే దుర్లభంగా 
మారుతున్నది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటమే ఈ అనర్థానికి ప్రధానమైన కారణం. 
హరీష్ రావు అనే నేను విరివిగా చెట్లు పెంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను

ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు, భూ భాగంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణకు హరితహారం అనే పవిత్ర యజ్ఞం చేపట్టారు. విరివిగా చెట్లు పెంచటమే లక్ష్యంగా సాగే ఈ బృహత్తర ప్రయత్నంలో నేను త్రికరణ శుద్దితో క్రియాశీలకంగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, తోటి ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో ఈ యేడాది నేను వెయ్యి మొక్కలు నాటుతానని, వాటిని పరిరక్షించి, చెట్లుగా ఎదిగేవరకు బాధ్యత తీసుకుంటానని ప్రతిన పూనుతున్నాను. తెలంగాణను హరిత తెలంగాణగా మార్చే ఈ మహాసంకల్పంలో నేను ఓ హరిత సైనికుడిగా సాగుతానని శపథం చేస్తున్నాను.