జగన్, కేసీఆర్, మై హోమ్ నెగిటివ్ వార్తలు వద్దు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్, కేసీఆర్, మై హోమ్ నెగిటివ్ వార్తలు వద్దు

టీవీ 9లో కొత్త పద్ధతులు
హైద్రాబాద్, జూలై 20, (way2newstv.com)
టీవీ9 అంటే… సెన్సేషనలిజానికి కేరాఫ్ అడ్రస్. తమకు టీఆర్పీలు తెచ్చి పెడుతుందనుకుంటే.. ఎంత పెద్ద వీఐపీ అయినా సమాజంలో.. పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తికి సంబంధించిన వార్తలనయినాదాటి పెట్టే ప్రయత్నమే చేయదు. అందుకే..టీవీ9ను అందరూ విమర్శించినా చూస్తూనే ఉంటారు. ఆ ఫలితం టీఆర్పీల్లో కనిపిస్తూనే ఉంటుంది. అయితే.. ఇది రవిప్రకాష్ ఉన్నంత వరకే. ఇప్పుడు.. టీవీ9 తన సహజసిద్దమైన స్వభావాన్ని కోల్పోతోంది. కొత్త యాజమాన్యం. వార్తలపై ఎడిటోరియల్ టీంపై.. ఆనేక ఆంక్షలు పెడుతోంది. దీనికి సంబంధించి. కొత్తగా ఓ మూడుకుటుంబాల వార్తల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని స్పష్టమైన దిశానిర్దేశం.. అందిందని చెబుతున్నారు. టీవీ9 కొత్త యాజన్యానికి యజమాని లాంటి మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు, తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలకు సంబంధించిన ఎలాంటి వ్యతిరేక వార్తలకు..బ్రేకింగ్‌ న్యూస్‌లుగా.. టీవీ9లలో చోటు లేదని.. స్పష్టమైన ఆదేశాలు ఎడిటోరియల్ టీంకు అందాయి. 
 జగన్, కేసీఆర్, మై హోమ్  నెగిటివ్ వార్తలు వద్దు

ఇటీవల జూపల్లి కంపెనీలు, ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత ఆయన వివరణ కూడా ఇచ్చారు. అప్పుడు జరిగిన పరిణామాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ.. మూడు కుటుంబాలకు చెందిన నెగెటివ్ వార్తలకు.. టీవీ9లో చోటు కల్పించవద్దని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఆ ప్రభావం టీవీ9లో స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల గెలుపోటములపై.. కథలు కథలుగా చెబుతున్న టీవీ 9 కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోయిన నిజామాబాద్ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. బీజేపీతో సంబంధాలు చెడిపోయిన నేపధ్యంలో.. ముందుముందు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు, సోదాలు వంటివి ఉంటాయని.. అనుమానిస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో… అప్రమత్తంగా ఉండాలనే తాజా సూచనలు ఇచ్చారంటున్నారు. నిజానికి ఏ చానల్ యజమాని కూడా తన ఇంట్లో ఐటీ సోదాలు చేశారని సొంత చానల్‌లో బ్రేకింగ్లు వేసుకోరు. అంత వరకూ బాగానే ఉన్నా.. టీవీకు మాత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు.. వారి కుటుంబసభ్యులకు సంబంధించి.. ఎలాంటి వ్యతిరేక వార్తలు వేయవద్దని చెబుతున్నారు. ఇదంతా టీవీ9 జర్నలిస్టులకు కొత్తగా ఉంది. రవిప్రకాష్ ఉన్నప్పుడు ఎడిటోరియల్ టీంకు పూర్తి స్వేచ్చ ఉండేది. ఏ వార్త వేసినా.. వేయకపోయినా.. ఆయన నుంచి ఎలాంటి ఎంక్వైరీ వచ్చేదికాదు. కానీ ఇప్పుడు మాత్రం.. ఏది ఏస్తే ఏమవుతుందో.. అన్న టెన్షన్‌లో టీవీ9 సిబ్బంది మునిగిపోతున్నారు