శ్రీశైలానికి గోదావరిపై అధ్యయనం


హైద్రాబాద్, జూలై 4, (way2newstv.com)
శ్రీశైలానికి నీటి తరలింపుపై తెలంగాణ అధికారుల అధ్యయనం కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు రెండు వైపులా నల్లమల అభయారణ్యం ఉండడంతో, దాన్ని తప్పి ంచే మార్గాన్ని ఆలోచిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కాలువ వరకు నీటిని చేరిస్తే ఆ నీరు నేరుగా, శ్రీశైలం రిజర్వాయర్‌లోకి పోతుంది. ఇందుకోసం అక్కడే ఉన్న గొలుసుకుకట్టు చెరువుల వ్యవస్థను సైతం పరిశీలిస్తున్నారు.
శ్రీశైలానికి గోదావరిపై అధ్యయనం


కొల్లాపూర్ ప్రాంతం, సోమశిల దేవస్థానం వరకు నీటిని తీసుకెళ్లినా, అక్కడి నుంచి నేరుగా శ్రీశైలంలోకే వెళుతుంది. తుపాకులగూడెం నుంచి శ్రీశైలంకు తెచ్చే మార్గంతో పాటు దుమ్ముగూడెం నుంచి లేదా, సాగర్‌కు తీసుకువెళ్లడంపైనా రిటైర్డ్ ఇంజనీర్లతో కలిసి చేస్తున్న అధ్యయనం ఇంకా కొలిక్కిరాలేదు. ఈ మార్గంలో భూసేకరణ, టన్నెల్ పొడవు చాలా ఉంటుందని, ఇప్పటికే ఆయకట్టుగా ఉన్న ప్రాంతం నుంచే భూసేకరణ చేయాల్సి వస్తుందన్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, కొలిక్కి రాలేదని సమావేశంలో పాల్గొన్న ఇంజనీర్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎలా ఉన్నా, నాగార్జునసాగర్‌కు, శ్రీశైలంకు చెరో రెండు టిఎంసిలు తీసుకునేందుకు వీలుగా సూత్రప్రాయ ప్రతిపాదనలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనల లోతుల్లోకి వెళుతుంటే, ఆయకట్టు దెబ్బతింటుంది. జలసౌధలో తెలంగాణ ఇంజనీర్లు, అధికారులు సమావేశమైనా ఓ అభిప్రాయానికి రాలేదు. దీంతో బుధవారం నాడు సమావేశంలో చర్చించడానికి ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. మంగళవారంనాటి సమావేశంలో ఇఎన్‌సి మురళీధర్ నేతృత్వంలో ఇంజనీర్ల బృందం శ్రీశైలానికి నీరెట్లా అనే అంశంపై సుధీర్ఘంగా చర్చించింది. దుమ్ముగూడెం, తుపాకులగూడెం ప్రాజెక్టుల నుంచి రెండు టిఎంసిల నీటిని తీసుకెళ్లే ఎలా, ఏకంగా నాలుగు టిఎంసిల నీరు తీసుకువెళితే ఎలా అనే విషయంపై ఇంజనీర్లు చర్చించారు.ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుంటే ఎలా అనే విషయంపైనా అధికారులు చర్చించారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా పోలవరం నుంచి నీటి తరలింపు సాధ్యాసాధ్యాలపై ప్రతిపాదనలు తయారు చేశారు. త్వరలో జలసౌధలో సమావేశం కానున్నారు. 
Previous Post Next Post