రేపు తెలంగాణ కేబినెట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రేపు తెలంగాణ కేబినెట్

హైద్రాబాద్ జూలై 15  (way2newstv.com)
17వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో నూతన పురపాలక చట్ట బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఈ నెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలకోసం జులై 12వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. 
 రేపు తెలంగాణ కేబినెట్

ఈ నెల 18న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, మరుసటిరోజు (19న) మధ్యాహ్నం రెండు గంటలకు కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయని ఈ నోటిఫికేషన్లో వెల్లడించారు. రాష్ట్రంలో నూతన పురపాలకచట్టం తీసుకురావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నరసింహన్ తరఫున నోటిఫికేషన్ విడుదలచేశారు. తొలిరోజు నూతన పురపాలకచట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ ప్రతులను ఎమ్మెల్యేలకు అందించనున్నారు. 19వ తేదీన ఈ బిల్లుకు సభ ఆమోదం తెలుపనున్నది. ఆ తర్వాత ఈ బిల్లును కౌన్సిల్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు. రాష్ట్రంలో నూతన పురపాలక చట్టం అమలులోకి వచ్చిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పురపాలక బిల్లు ముసాయిదాకు తుదిరూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపించారు.