జగన్ పేద్ద... టార్గెట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ పేద్ద... టార్గెట్

విజయవాడ, జూలై 23, (way2newstv.com)
రాష్ట్రంలో 80 శాతం మంది ఉన్న ఓటర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్లుంది. శాసనసభలో ఈరోజు కీలక బిల్లును ప్రవేశపెట్టారు. జగన్ తన పాదయాత్రలోనూ, బీసీ గర్జనలోనూ ఇచ్చిన మాట మేరకు చట్టరూపాన్ని శాసనసభలో తెచ్చారు. మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదల జగన్ లో స్పష్టంగా కన్పిస్తుంది. అందులో భాగంగానే ఆయన బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలపై ఫోకస్ పెట్టారు.ఇకపై ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టులన్నింటిలో యాభై శాతం బడుగు బలహీనవర్గాలకే కేటాయిస్తారు. ఇప్పటి వరకూ నామినేటెడ్ పోస్టులు అగ్రకుల ఆధిపత్యంలోనే ఉండేవి. ఎక్కువగా ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న నామినేటెడ్ పోస్టులకు బాగానే గిరాకీ ఉంటుంది. 
జగన్ పేద్ద... టార్గెట్

ఈ పోస్టులు దక్కితే పార్టీలో సముచితమైన స్థానం లభించడమే కాకుండా రాజకీయంగా ఎదుగుదలకు ఉపయోగపడుతుందని నేతలు భావిస్తుంటారు.ఎక్కువగా పార్టీలో ద్వితీయ శ్రేణి 
నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం తపన పడుతుంటారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయంతో బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ మందికి నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయి. ఇప్పటి వరకూ అగ్రకులాల ఆధిపత్యంతో పైరవీలు సాగిస్తూ భర్తీ అయిన నామినేటెడ్ పోస్టులు ఈసారి రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేయనున్నారు. అయితే బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారైనా నామినేటెడ్ పోస్టులంటే అది అధికార పార్టీకి చెందిన వారే ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఇక నామినేటెడ్ పనుల్లోనూ బీసీలకు యాభైశాతం, మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో జగన్ కొత్త చట్టం తీసుకువచ్చారు. దీనివల్ల ఎక్కువ మందికి కాంట్రాక్టులు లభించి లబ్ది పొందే అవకాశముంది. ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో ఏలూరు జిరిగిన బీసీ డిక్లరేషన్ సభలోనే జగన్ ప్రకటించారు. మరి ఇదంతా క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు జరిగితే జగన్ టార్గెట్ రీచ్ అవుతారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.