విదేశీ భామలతో మన్మధుడు సందడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విదేశీ భామలతో మన్మధుడు సందడి

హైద్రాబాద్, జూలై 22 (way2newstv.com)
టాలీవుడ్ ‘కింగ్‌’ నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘మన్మథుడు 2’. దశాబ్దంన్నర కిందట వచ్చిన సక్సెల్ ఫుల్ మూవీ ‘మన్మథుడు’కు సీక్వెల్‌గా వస్తుండటంతో ఈ మూవీలో భారీగా అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన మన్మథుడు 2 టీజర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని తొలి పాట ‘హే మెనీనా.. ఐ సీయూ వాన్నా లవ్‌’ విడుదలైంది. యూట్యూబ్‌లో భారీగా వ్యూస్‌తో ప్రేక్షకులను నాగ్ మరింతగా ఆకట్టుకుంటున్నారు. 
 విదేశీ భామలతో మన్మధుడు సందడి

ఈ పాటలో విదేశీ భామలతో నాగ్ రొమాన్స్ చూస్తుంటే నాగచైతన్యకు బ్రదర్‌లా కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ తెగ కామెంట్ చేస్తున్నారు. మన్మథుడుకు సీక్వెల్‌కు వస్తున్న ఈ మూవీకి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మన్మథుడి సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. కీర్తి సురేశ్‌, సమంత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు మ్యూజికల్ సక్సెస్ సాధిస్తాయని మూవీ యూనిట్ ధీమాగా ఉంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న మన్మథుడు 2 ఆగస్టు 9న విడుదలకు సిద్ధంగా ఉంది.