నిండు కుండలా మారిన ప్రాజెక్టులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిండు కుండలా మారిన ప్రాజెక్టులు

మహబూబ్ నగర్, జూలై 24, (way2newstv.com)
పాలమూరు జిల్లాల్లో అంతర్భాగమైన సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లకు ఎగువ కర్నాటక, మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువ తెలంగాణలోని క్రష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టుకు నీటిరాక కొనసాగుతుంది. దీంతో మక్తల్ మండలంలోని సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లను జూరాల బ్యాక్ వాటర్ నుండి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావుల ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి సూచనల మేరకు ప్రాజెక్టు అధికారులు నీటితో నింపుతున్నారు.కర్నాటకలోని నారాయణపూర్ డ్యాం నుండి విడుదలైన నీరు 1.80 లక్షల క్యూసెక్కులు జూరాలకు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఈఈ విజయనందన్ తెలిపారు. ఈసందర్భంగా అటు సంగంబండ, ఇటు భూత్పూర్ రిజర్వాయర్లులలో నీరు వచ్చి చేరడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
నిండు కుండలా మారిన ప్రాజెక్టులు

సంగంబండ రిజర్వాయర్ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 3.319 టీఎంసీలు కాగా సజీవ నీటి నిల్వ 1.593 టీఎంసీలు. అలాగే భూత్పూర్ రిజర్వాయర్ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 1.313 టీఎంసీలు కాగా సజీవ నిలువ 0.90 టిఎంసిలు. క్రిష్ణా జలాల నుండి భీమా ఫేజ్-1కు 11.687 టీఎంసీలు, భీమా ఫేజ్-2కు 8.313 టీఎంసీలు మొత్తం 20 టీఎంసీల నీటిని వాడుకొనుటకు అనుమతులు ఉండటంతోటి 1993-94లో భీమా ఫేజ్-1 నుండి సంగంబండ రిజర్వాయర్ ద్వారా 63,600 ఎకరాలకు, భూత్పూర్ రిజర్వాయర్ నుండి 47,400 ఎకరాలకు సాగునీటిని వాడుకునే విధంగా ప్రతిపాదనలు చేశారు. ఈ రెండు రిజర్వాయర్ల నుండి మొత్తం లక్షా 11వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.జూరాల బ్యాక్ వాటర్ నుండి మక్తల్ మండలంలోని పంచదేవ్‌పహాడ్ సమీపంలోని 2.5 కిలోమీటర్ల సాధారణ కాలువ ద్వారా, అక్కడి నుండి 1.4 కిలోమీటర్లు సొరంగం ద్వారా చిన్నగోప్లాపూర్ శివారులోని స్టేజ్-1 పంపౌజ్‌కు 45మీటర్ల ఎత్తు నుండి నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. అక్కడి నుండి భూత్పూర్ రిజర్వాయర్‌ను నింపుతూ మక్తల్ సమీపంలోని స్టేజ్-2పంపౌజ్‌కు తరలించి అక్కడి నుండి 22 మీటర్ల ఎత్తు నుండి నీటిని లిప్టు చేస్తున్నారు. మక్తల్ పంపౌజ్ నుండి 7 కిలోమీటర్లు కాలువ ద్వారా నీటిని తీసుకెళ్లి సంగంబండ రిజర్వాయర్‌ను నింపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పెండింగ్‌లోని పనులను పూర్తిచేసి భీమా ఫేజ్-1కు, ఫేజ్-2కు నీటిని విడుదల చేస్తున్నారు.