శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రారావు
అమరావతి, జూలై 30 (way2newstv.com)
విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వెనుకబడిన కాపులకు బాసటగా గత తెలుగుదేశం ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌లో 5% కోటా రిజర్వేషన్ అందిస్తే.. దానిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వారిని నిలువునా మోసం చేసిందని శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రారావు విమర్శించారు.విద్యాసంస్థల్లో పదిశాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలులో కాపు రిజర్వేషన్లు ఉండవని వైకాపా ప్రభుత్వం చెప్పడం కాపులను నమ్మించి గొంతు కోయడమేనని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాదయాత్రలో చెప్పిన ఆర్భాటపు మాటలకు..
కాపు సంక్షేమానికి చంద్రబాబు ఊపిరి పోస్తే.. వైఎస్ జగన్ గొంతుకోసారు
ఆచరణలో చూపుతున్న దానికి పొంతన లేని విధంగా జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ద్య్యబట్టారు. కాపులకు రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏవిధంగా మోసం చేశారో.. ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి అంతకు మించి కాపులను వంచన చేస్తున్నారన్నారు. కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లును జగన్మోహన్‌రెడ్డి ఏవిధంగా తిరస్కరిస్తారు.? ఇది కాపులను అవమానించడం కాదా..? అని ప్రశ్నించారు.అన్ని రంగాలలో వెనుకబడిన కాపులకు న్యాయం చేకూర్చే విధంగా కాపులకు ఈడబ్ల్యూఎస్‌లో 5% రిజర్వేషన్‌ను శాసనసభలో ఆమోదించి తెలుగుదేశం ప్రభుత్వం బిల్లు తీసుకొస్తే.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే తొలగించడం కక్ష సాధింపు చర్యకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇది తుని ఘటనను మించిన దారుణ చర్య. మాట మార్చి కాపులకు అన్యాయం చేస్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు.
Tags:
Andrapradeshnews