కమల్ తో నటించే అవకాశం...

హైద్రాబాద్, జూలై 27, (way2newstv.com)
లెజండ్రీ యాక్టర్ కమల్‌ హాసన్‌తో కలిసి నటించాలని కోరుకునో వారు ఉండరు. కమల్ తో కలిసి ఓ చిన్న సీన్ లో కనిపించినా చాలు అని భావిస్తుంటారు చాలామంది. కమల్ తో ఫొటో దిగినా చాలు అని తృప్తి పడతారు. అయితే ఇప్పుడు కమల్ తో కలిసి నటించాలనుకునేవారికి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ గుడ్ న్యూస్ చెప్పింది.భారతీయుడు 2 సినిమా కోసం నటీనటులు కావాలని లైకా ప్రొడక్షన్స్‌ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
 కమల్ తో నటించే అవకాశం...

సినిమాలోని సహాయ నటీనటుల పాత్రల కోసం ఆసక్తి ఉన్న, శిక్షణ పొందిన వారు కావాలని తెలిపింది. మహిళలు, పురుఫులు కావాలని.. వయో పరిమితి లేదని, ఆసక్తి ఉన్న వారు ప్రొఫైల్‌ పంపాలని కోరింది.1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కుతోంది. గత ఏడాది డిసెంబరులో చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే సినిమా మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది.  కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు తెలిసింది. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు.
Previous Post Next Post