బాలీవుడ్ స్థాయికి టాలీవుడ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాలీవుడ్ స్థాయికి టాలీవుడ్

హైద్రాబాద్, జూలై 23 (way2newstv.com)
తెలుగు సినిమా స్థాయి రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ వైపు చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా వైపు చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఎందుకంటే బాహుబ‌లితో పాటు మ‌రికొన్ని సినిమాలు కూడా ఇప్పుడు మ‌న సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటి చెప్పాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తెర‌కెక్కుతున్న సాహో.. సైరా లాంటి సినిమాలు బ‌డ్జెట్ ప‌రంగానే కాకుండా టెక్నిక‌ల్ ప‌రంగా కూడా బాలీవుడ్ సినిమాల‌ను శాసిస్తున్నాయి. 
బాలీవుడ్ స్థాయికి టాలీవుడ్

మ‌రోవైపు మార్కెట్ కూడా అలాగే పెరిగిపోయింది.ప్ర‌భాస్ సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 300 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి సైరా సినిమా కోసం కూడా ఎగ‌బ‌డుతున్నారు బ‌య్య‌ర్లు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం భారీ పోటీ నెల‌కొంది. ఏపీలో డిస్ట్రిబ్యూట‌ర్లు సైరా కోసం ఎగ‌బ‌డుతున్నారు. చిరంజీవి హీరో కావ‌డంతో ఆ మాత్రం క్రేజ్ ఉండ‌టం స‌హ‌జం. పైగా ఖైదీ నెం 150 అక్క‌డ చ‌రిత్ర తిర‌గ‌రాసింది. ఇప్పుడు సైరా విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు బ‌య్య‌ర్లు.ఈ క్ర‌మంలోనే భారీ పోటీ మ‌ధ్య యువీ క్రియేష‌న్స్ సైరా హ‌క్కుల‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఏపీ హ‌క్కుల కోసం వీళ్లు భారీ మొత్తం కోడ్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సంస్థ నుంచి సాహో లాంటి భారీ సినిమా వ‌స్తుంది. మ‌రోవైపు డిస్ట్రిబ్యూష‌న్‌లోనూ వాళ్లు త‌మ మార్క్ చూపించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అక్టోబ‌ర్ 2న సైరా విడుదల కానుంది