హైదరాబాద్, జూలై 23 (way2newstv.com)
తెలంగాణ మున్సిపల్ బిల్లును గవర్నర్ నరసింహన్ వెనక్కి పంపినట్లు సమాచారం. సదరు బిల్లు మొత్తం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పలు సవరణలను అయన కోరారు. సవరణలతో కూడిన ఆర్డినెన్స్ ని ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బిల్లులో సవరణ చేయాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారాలు తొలగింపు పై కుడా అయన అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.
మున్సిపల్ బిల్లును తిప్పి పంపిన గవర్నర్
ప్రజాప్రతినిధులను తొలగించే అధికారం కలెక్టర్లకు ఇవ్వడంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసారు. స్థానిక సంస్థలకు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం లోని 73, 74 క్లాజులు సవరణ చేశారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం గా ఉంది. 85 శాతం హరితహారం మొక్కలు బతకపోతే వార్డు మెంబర్లను తొలగిస్తామనటంపైనా అభ్యంతరం వ్యక్తం చేసారు. అసెంబ్లీ ప్రొరోగ్ కావటంతో మున్సిపల్ బిల్లుపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది.
Tags:
telangananews