బిసి ఓటర్ల లెక్కింపులో అవక తవకలు..శాస్త్రీయంగా బి.సి లెక్కలు తేల్చాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బిసి ఓటర్ల లెక్కింపులో అవక తవకలు..శాస్త్రీయంగా బి.సి లెక్కలు తేల్చాలి

ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆర్.కృష్ణయ్య లేఖ 
హైదరాబాద్ జూలై 18(way2newstv.com
త్వరలో రాష్ట్రంలోని 132 మున్సిపాలిటీ ఎన్నికలను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారని, అందులో బిసి ఓటర్ల లెక్కింపులో అవక తవకలు చోటుచేసుకున్నాయని ,శాస్త్రీయంగా బి.సి లెక్కలు తేల్చాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు.ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కు లేఖ రాసారు. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తో సహా అన్ని మున్సిపాలిటీలలో బీసీ జనాభా లు లెక్కలు సేకరించారు బిసి ఓటర్ల లెక్కల సేకరణ లో అధికారులు శాస్త్రీయంగా ఇంటింటా తిరిగి సేకరించడం లేదు. హోటళ్లలో, లాడ్జిలలో కూర్చుని టిక్కులు కొడుతు పేర్లను బట్టి టిక్కులు కొడుతున్నారని ఆరోపించారు.  
బిసి ఓటర్ల లెక్కింపులో అవక తవకలు..శాస్త్రీయంగా బి.సి లెక్కలు తేల్చాలి

బిసి ఓటర్ల లెక్కలు కచ్చితంగా శాస్త్రీయం గా ఉండాలంటే ఇంటింటా తిరిగి సేకరించాలి అప్పుడే ఖచ్చితమైన లెక్కలు వస్తాయని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో 27 శాతం ఉందని ప్రకటించారు. ఇది పూర్తి అన్యాయం, అక్రమం. కొన్ని డివిజన్లలో 12 శాతం అని తేల్చారు. ఇది పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు.  గతంలో అనేకసార్లు బీసీ జనాభా లెక్కలు తీస్తే గ్రేటర్ హైదరాబాద్  పరిదిలో 45 శాతానికిపైగా బీసీ జనాభా ఉన్నట్లు తేల్చారు. సమగ్ర కుటుంబ సర్వేలో గ్రేటర్ హైదరాబాదులో బి.సి  జనాభా 45 శాతం ఉన్నట్లు తేలింది. గత నాలుగు మున్సిపల్ ఎన్నికలలో బీసీ జనాభా లెక్కలలో 40  శాతం నుంచి 45 శాతం మధ్యలో ఉంది. పైగా ఇటివల ముస్లింలను బి.సి జాబితాలో కలిపారు. దీనిలో బి.సి జనాభా ఇంకా పెరుగాలి. కాని తగ్గించి చూపడం అన్యాయమని పేర్కొన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా 27% కు ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. బిసి జనాభా తక్కువ చూపించి మున్సిపల్ చట్టాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లను తగ్గించాలని కుట్ర చేస్తే సహించేది లేదన్నారు.అలాగే ఇతర 132 మునిసిపాలిటీలలో కూడా 20 నుంచి 30 శాతం లోపు చుయిస్తున్నారు. ఇది తక్కువ చేయించడం వలన బీసీ రిజర్వేషన్లను తగ్గించే ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్రామపంచాయతీ, జడ్పిటిసి, ఎంపిటిసి లలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతం తగ్గించి అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా తగ్గించి మరో ద్రోహం చేయతల  పెడుతున్నారని, ఈ వైఖరి మార్చుకోవాలన్నారు. పూర్తిగా శాస్త్రీయంగా బిసి ఓటర్ల లెక్కించిన తర్వాత ఎన్నికలు జరపాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేసారు.