పట్టణంలోని ఉర్దూగర్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు ఉరివేసుకొని మంగలి వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్యచేసుకున్నాడు. మృతుడు ఉదయం ఇంటి నుండి బహిర్బుమికి అని వెళ్లి అక్కడే గోడకు ఉరివేసుకుని మరణించాడు.
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని వ్యక్తి మృతి
బహిర్బుమికి వెళ్లిన వెంకటేష్ ఎంత కు రాకపోవడంతో భార్య మరియు కుటుంబసభ్యులు వెతుకుతూ ఉండగా మృతుడు గోడకు ఉరివేసుకొని కనపడంతో పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.అయితే మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు మృతుడికి కొద్దీ రోజులుగా అప్పుల ఎక్కువ కావడం తో బాధ పడేవాడు అని, కొంత మంది డబ్బులు కోసం తన షాప్ దగ్గర కు వచ్చి తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్న తరుణంలోనే మనస్తాపం తో ఉరి వేసుకుని మరణించాడు అని బంధువులు పేర్కొన్నారు.
Tags:
News