రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జ్ గా మల్లురవి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జ్ గా మల్లురవి

హైదరాబాద్, జూలై 13  (way2newstv.com): 
రంగారెడ్డి జిల్లా  మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జ్ గా మల్లురవి నియమితులైనారు.ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లురవి నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీం పట్నం లో జిల్లా మున్సిపల్ ఎన్నికల పైన  మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మీటింగ్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మల్రెడ్డి రంగారెడ్డి,వంశీచందర్ రెడ్డి,విశ్వేశ్వరరెడ్డి పాల్గొంటారని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జ్ గా మల్లురవి 

ఇలా రంగారెడ్డి మొత్తము అన్ని ప్రాంతాలలో మున్సిపల్ ఎన్నికల సమయత్త మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవసరం లేని సెక్రెటేరియట్,అసెంబ్లీ నిర్మాణం చేపడతాం రాజరిక పరిపాలన చేస్తుందని ఆయన దుయ్యబట్టారు.ఈ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా ప్రజలు బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపీ లుగా గెలిపించిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసారు.ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.